విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిత్యవసర వస్తువులు, వంట నూనెలను పరిమితికి మించి స్టాక్ నిల్వ చేసి, కృత్రిమ కొరత సృష్టించి మార్కెట్లో అధిక ధరలకు అమ్మితే బైండోవర్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి.కనకరాజు హెచ్చరించారు. మచిలీపట్నం, గుడివాడ, విజయవాడ నగరంలోని పలు దుకాణాల్లో సోమవారం పౌరసరఫరాలు, తూనికలు కొలతలు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా వంట నూనెలను నిర్దేశించిన ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని దుకాణాల నిర్వాహకులను ఆదేశించారు. బహిరంగ మార్కెట్లో అనధికారికంగా స్టాక్ నిల్వచేసి కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు అమ్మితే బైండోవర్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ముఖ్యంగా వంట నూనెలను అక్రమంగా నిల్వచేసినా, అధిక ధరలకు అమ్మినా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధిత దుకాణాలపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయడం జరుగుతుందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ టి.కనకరాజు అన్నారు. నిత్యావసర సరుకులను, ముఖ్యంగా వంట నూనెలను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని, అధిక ధరలకు అమ్మినా, పరిమితికి మించి నిల్వచేసినా కేసులు నమోదు చేయడం జరుగుతుందని విజయవాడ యూనిట్ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి.కనకరాజు హెచ్చరించారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …