ప్రజల మదిలో శాశ్వతంగా నిలిచేలా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాయని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు.శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్ పండరిపురం నందు గడప గడపకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా అవినాష్ ఇంటి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు గురుంచి,ఈ డివిజన్ లో చేపట్టిన అభివృద్ధి పనులు గురుంచి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన రెండున్నర ఏళ్ల కాలంలోనే సంక్షేమ పథకాలు అమలు కు దాదాపు లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు మహిళల ఖాతాలలో జమ చేసిన ఘనత జగనన్న దే అని అన్నారు.అవినీతి,లాంచలకు తావులేకుండా పారదర్శకంగా నేరుగా మహిళల ఖాతాలలోనే నగదు జమ చేయడం మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అని అన్నారు.తెలుగుదేశం పార్టీ కి బలముంది అని వారు ప్రచారం చేసుకొనే ఈ 12వ డివిజన్ లోనే దాదాపు 6 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు, సైడ్ డ్రైనేజీ వ్యవస్థ, ఉర్దూ స్కూల్ అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని అన్నారు.రోజురోజుకు ప్రజలలో ముఖ్యమంత్రి కి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్ష టీడీపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. వాటిని తిప్పికొడుతూ ప్రజలకు వాస్తవాలు వివరించి పార్టీని ప్రజలకి మరింత చేరువ చేయడానికె ఈ గడప గడప వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేపటినట్టు తెలిపారు. అర్హత ఉండి ఏదైనా సాంకేతిక కారణాల వల్ల ఎవరికైనా ఏదైనా పధకం రాకపోతే ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా కల్పించారు. ప్రతి ఇంటిలో ఏ ఏ సంక్షేమ పథకాలు అందజేశారో వారికి సవివరంగా వివరించి పార్టీకి మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, స్థానిక వైస్సార్సీపి ఇంచార్జ్ మాగంటి నవీన్,రిజ్వాన్,వైస్సార్సీపీ నాయకులు ఆళ్ల చెల్లారావు, కాళీ,కలీమ్,కార్పొరేటర్లు, ఇంచార్జిలు,వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉలి చెక్కిన కల

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర చెక్క కళాకారుల వారసత్వం చెక్క మలిచే కళాకారుల పరస్పర సహకార సంస్థ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *