-ఎమ్మెల్యే మల్లాది విష్ణుని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రొ. కొంపల్లి ఉదయశ్రీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్న నున్న గ్రామవాసి కొంపల్లి ఉదయశ్రీ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణుని ఆంధ్రప్రభ కాలనీలోని ఆయన కార్యాలయంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అంతర్జాతీయంగా జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేసిన ఆమెను ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. ప్రస్తుతం కొంపల్లి ఉదయశ్రీ అగిరిపల్లి మండలం పోతవరప్పాడు ఎన్.ఆర్.ఐ. ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సీఎస్ఈ విభాగంలో అసోసియేటర్ ప్రొఫెసర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. 2021 సంవత్సరానికి గానూ అత్యధికంగా 27 సామాజిక కార్యక్రమాలు నిర్వహించినందుకు గానూ ఆమెకు ఈ గుర్తింపు లభించింది. లాక్ డౌన్ సమయాన్ని కూడా వినియోగించుకుని 50 సర్టిఫికేషన్ కోర్సులు పూర్తి చేసిన కొంపల్లి ఉదయశ్రీ.. నేటి యువతకు ఆదర్శప్రాయమని మల్లాది విష్ణు అన్నారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.