డా. వైఎస్సార్‌ తల్లిబిడ్డా ఎక్స్‌ప్రెన్‌ వాహనాల ప్రారంభోత్సవానికి అంతా సిద్దం…


-జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏప్రిల్‌ 1వ తేదీ శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్న డా.వైయస్‌ఆర్‌ తల్లిబిడ్డా ఎక్స్‌ప్రెస్‌ వాహనాల ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సిద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ జె నివాస్‌ అధికారులను ఆదేశించారు.
ప్రారంభోత్సవానికి చేస్తున్న ఏర్పాట్లను బెంజ్‌సర్కిల్‌ వద్ద గురువారం శాసనమండలి సభ్యులు, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌, మున్సిపల్‌ కమీషనర్‌ పి. రంజిత్‌బాషా, జాయింట్‌ కలెక్టర్లు డా. కె మాధవిలత, ఎల్‌ శివశంకర్‌, సబ్‌ కలెక్టర్‌ జి సూర్యసాయి ప్రవీణ్‌ చంద్‌ డిసిపి వి. హర్షవర్థన్‌రాజు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఏప్రిల్‌ ఒకటో తేది అనగా రేపు ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు అందజేయనున్న 500 డా.వైయస్‌ఆర్‌ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలను బెంజ్‌ సర్కిల్‌ వద్ద లాంఛనంగా ప్రారంభించనున్నారన్నారు. కార్యక్రమం నిర్వహించే ప్రధాన వేదిక ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఏర్పాట్లు పకడ్బందీగా ఎటువంటిలోటుపాట్లు లేకుండా ఉండాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు సంబంధించి 500 వాహనాలు ప్రారంభించనున్నారన్నారు. వీటిలో జిల్లాల వారిగా శ్రీకాకుళం జిల్లాకు 23, విజయనగరం 33 , విశాఖపట్నం 67, తూర్పుగోదావరి జిల్లా 62 , పశ్చిమ గోదావరి జిల్లా 33, కృష్ణా జిల్లా 33, గుంటూరు 31, ప్రకాశం 24, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా19, చిత్తూరు 52, డా వైఎస్‌ఆర్‌ కడప జిల్లాకు 23, కర్నూలు 64, అనంతపూర్‌ జిల్లాకు 36 వాహనాలు ఉన్నాయన్నారు.
అనంతరం సిద్ధార్థ మెడికల్‌ కళాశాల క్రీడా మైదానంలో ఉంచిన డా. వైఎస్సార్‌ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలను జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌, జాయింట్‌ కలెక్టర్లు, డా.కె. మాధవీలత, ఎల్‌ శివశంకర్‌, సబ్‌ కలెక్టర్‌ జి సూర్యసాయి ప్రవీణ్‌ చంద్‌లు పరిశీలించి వాహనాల డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 10 వాహనాలకు ఒక విఆర్‌వో, 10 మంది విఆర్‌వోలకు ఒక తహాశీల్థార్‌ ఇన్‌చార్జిగా విధులు నిర్వర్తిస్తారన్నారు. వాహనాలను వారికి కేటాయించిన క్యూ పద్దతిలో ఉంచి ఆయా జిల్లాలకు నిద్దేశించిన రూట్‌ ద్వారా వాహనాలను తీసుకువెళ్ళాలన్నారు. గురువారం అనగా నేటి రాత్రి 10:30 గంటల నుండి వాహనాలను మహాత్మాగాంధీ రోడ్డులో ఉంచాలన్నారు. డ్రైవర్లు వాహనాలను వదిలి వెళ్లరాదని, వారికి ఉదయం అల్పాహారం వాహనంలోనే అందించాలని, కాలకృత్యాలు తీర్చుకునేందుకు వీలుగా మున్సిపల్‌ టాయిలెట్లను వినియోగించుకునేందుకు, అవసరమైన చోట అధనంగా మొబైల్‌ టాయిలెట్లను ఏర్పాటు చేయాలని మున్సిపల్‌ కార్పొరేషన్‌ శాఖ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.వాహనాల కండిషన్‌ను మరొక సారి సరి చూసుకోవాలని కలెక్టర్‌ జె నివాస్‌ వాహనాల డ్రైవర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిపి వి. హర్షవర్థన్‌ రాజు, జడ్పిసిఇవో సూర్యప్రకాశరావు, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ శ్రీధర్‌ ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *