-తాసిల్దారు వేమూరు K.మోహనరావు
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
వయసు 18 సం॥రాలు దాటిన వారందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని వేమూరు తహసిల్దారు K.మోహనరావు అన్నారు. గురువారం మార్చి వేమూరు నియోజకవర్గ పరిధిలోని వేమూరు నందు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఆదేశానుసారం స్వీప్ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నందు విద్యార్థులకు ఓటరు నమోదు ఎన్ని సంవత్సరాలకు చేసుకోవాలి ! ఏ రకంగా ఓటు నమోదు చేసుకోవాలి ?అనే పలు విషయమై వారికి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఓటర్ అవేర్నెస్ కాంటెస్ట్ లో భాగంగా వారికి క్విజ్ పోటీలు నిర్వహించడం జరిగింది ఓటు ఎలా నమోదు చేసుకోవాలి ఓటర్లకు సంబంధించిన విషయాలు ఈ విషయాల మీద వారికి క్విజ్ పోటీ నిర్వహించడం జరిగింది. పై కార్యక్రమమునకు K రాజా రమేష్ డిప్యూటీ తాసిల్దార్ వేమూరు శ్రీనివాస రావు వేమూరు బి ఎల్ వో లు పెద్ద ఎత్తున జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ మరియు విద్యార్థులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.