Breaking News

4.91 లక్షల మంది పెన్షనర్లకు రూ.124.56 కోట్లు విడుదల… : కలెక్టర్ వి.ప్రసన్న వెంకటేష్

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్ఆర్ పెన్షన్ కానుక కింద జిల్లా వ్యాప్తంగా 4.91 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్దం చేసినట్లు జిల్లా కలెక్టర్ వి.ప్రసన్న వెంకటేష్ తెలిపారు. మార్చినెల పెన్షన్ మొత్తాలను ఏప్రిల్ 1వ తేదీన నేరుగా లబ్ధిదారుల ఇంటివద్ద, వారి చేతికి అందించాలన్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ సంకల్పంలో భాగంగా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. శుక్రవారం (ఏప్రిల్ 1వ తేదీ) తెల్లవారుజాము నుంచే వాలంటీర్లు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. ఈ మేరకు పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.124.56 కోట్లు ఇప్పటికే విడుదల చేసిందని తెలిపారు. జిల్లాలో 4,91,094 మంది లబ్ధిదారులకు అందించేందుకు ఈ మొత్తాలను గ్రామ, వార్డు సచివాలయాలకు పంపిణీ చేశారని తెలిపారు. లబ్దిదారుల్లో 2,73,590 మంది వృద్దులు,1,03,893 మంది వితంతువులు ,55,404 మంది విభిన్న ప్రతిభావంతులు ఉన్నారన్నారు. సచివాలయాల ద్వారా వాలంటీర్లు పెన్షన్ మొత్తాలను నగదు రూపంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి అందచేస్తారని అన్నారు. ఇందుకోసం సుమారు16,330 మంది వాలంటీర్లు సిద్దంగా ఉన్నారన్నారు. పెన్షన్ అందచేసే సందర్భంలో లబ్ధిదారులను గుర్తించేందుకు బయోమెట్రిక్ తో పాటు ఐరిస్, ఆర్బిఐఎస్ విధానంను కూడా వినియోగిస్తారని తెలిపారు. పెన్షన్ మొత్తాలను త్వరితగతిన నూరుశాతం పంపిణీ జరిగేలా ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా డి ఆర్ డి ఎ ద్వారా పెన్షన్ల పంపిణీని పర్యవేక్షిస్తామని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంద్రకీలాద్రి పై సంక్రాంతి వేడుకలు 2 వ రోజు…

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : తేదీ. 13-01-2025 నుండి తేదీ. 15-01-2025 వరకు సంక్రాంతి వేడుకలు సందర్బంగా మంగళవారం  ‘సంక్రాంతి’ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *