Breaking News

రోడ్డుపై స్పీడ్ బ్రేకర్ లను సత్వరంగా ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలను అరికట్టాలి… : వేముల శ్రీనివాస్     

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అనేక రోడ్డు ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్సుగా మారుతున్న అజిత్ సింగినగర్ లోని డాబాకోట్ల రోడ్డుపై స్పీడ్ బ్రేకర్ లను సత్వరంగా ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని విజయవాడ నగర డిప్యూటీ మేయర్ అవుతూ శైలజారెడ్డి కి వినతి పత్రాన్ని ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ అందజేశారు. గురువారం విజయవాడ నగరంలో గల అజిత్ సింగ్ నగర్ కృష్ణాహోటల్ సెంటర్ నందు గల డిప్యూటీ మేయర్  కార్యాలయం నందు డిప్యూటీ మేయర్ అవుతూ శైలజారెడ్డి ని కలిసి నగరంలోని ప్రధాన రోడ్డులు, కూడళ్లలో వాహనాల స్పీడ్ కు వాటి యొక్క వేగం పరిమితిని నియంత్రించేందుకు స్పీడ్ బ్రేకర్ లను,  రోడ్డు డివైడర్ లను ఏర్పాటు చేయాలని జాతీయ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్.ఎస్.యు.ఐ.) తరపున వినతి పత్రం అందజేశారు. ముఖ్యంగా డాబా కోట్లు రోడ్డు నందు పలు రకాల ప్రజారవాణా వాహనాలైన ఆర్టీసీ బస్సులు, వందలకొలది ఆటోలు మరియు ద్విచక్ర వాహనాలు తిరుగుతుంటాయని పైగా ఈ రోడ్డుకు ఇరువైపులా పలు విద్యాసంస్థలు కలవనీ, విద్యార్థులు తమ విద్యా సంస్థలకు వెళ్లే తరుణంలో ఈ వాహనాల అతివేగం వలన అనేక ప్రమాదాలకు గురౌవడం జరుగుతుందన్నారు. కేవలం విద్యార్థులే కాదు వాహనంపై వెళ్లేవారు కూడా వాహనాలు అతివేగం వలన వాహనాల ఓవర్టేక్ వలన ప్రమాదాల బారిన పడడం జరుగుతుందనీ, ముఖ్యంగా డాబాకోట్ల సెంటర్, వివేకానంద స్కూల్ సెంటర్, గంగానమ్మ గుడి, గంగానమ్మ గుడి నుండి కృష్ణాహోటల్ సెంటర్ కి వెళ్లే టర్నింగ్ పాయింట్ వద్ద ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయనీ, దయచేసి ఈ రోడ్డుపై తక్షణమే స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేసి మరి కొంతమంది ఈ రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా కాపాడాలని కోరడమైనదన్నారు. వినతి పత్రాన్ని స్వీకరించిన డిప్యూటీ మేయర్  మాట్లాడుతూ నగరంలోని ప్రధాన రోడ్లపై స్పీడ్ బ్రేకర్ లను అన్ని రోడ్ల నందు అతి త్వరలోనే వేస్తామనీ, ముఖ్యంగా అజిత్ సింగ్ నగర్ లోని డాబాకోట్ల రోడ్డు పై స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలను స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసే నియంత్రిస్తామనీ, ప్రధానమైన ఈ సమస్యపై కౌన్సిల్లో చర్చించి నగరంలోని ప్రధాన రోడ్ల నందు స్పీడ్ బ్రేకర్ లను, వాహనాల వేగాన్ని కంట్రోల్ చేసేందుకు పలు రకాల వాహన కంట్రోల్ నియంత్రణ చర్యలు తీసుకుంటామని అన్నారని తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.యు.ఐ. నగర నాయకులు బత్తుల అంకమ్మరాజు, ఉప్పు జస్వంత్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంద్రకీలాద్రి పై సంక్రాంతి వేడుకలు 2 వ రోజు…

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : తేదీ. 13-01-2025 నుండి తేదీ. 15-01-2025 వరకు సంక్రాంతి వేడుకలు సందర్బంగా మంగళవారం  ‘సంక్రాంతి’ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *