వైఎస్సార్‌ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి…


-ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలు మారుతున్నాయి
-ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వాస్పత్రిలో ప్రసవానంతరం తల్లీబిడ్డను సురక్షితంగా, సౌకర్యవంతంగా ఇంటికి చేర్చే బృహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం అధునాతన వసతులతో కూడిన 500 ఎయిర్‌ కండిషన్డ్‌ ‘డాక్టర్‌ వైఎస్సార్‌ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ వాహనాలను ప్రారంభించింది. విజయవాడలోని బెంజ్‌ సర్కిల్‌ వేదికగా శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జెండా ఊపి ఈ వాహనాలను ప్రారంభించారు. తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ ఎయిర్‌ కండిషన్డ్‌ వాహనాన్ని పరిశీలించిన అనంతరం సీఎం వైయస్‌.జగన్‌ మాట్లాడుతూ… ఈ రోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దాదాపుగా 500 కొత్త ఎయిర్‌ కండిషన్డ్‌ వాహనాలను రాష్ట్రం నలుమూలలకూ ఈ రోజు పంపుతున్నాం. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు మంచి జరగాలని మొట్టమొదట నుంచి ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. చెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు, ఆ చెల్లెమ్మలు గర్భం దాల్చిన వెంటనే వారికి అండగా ఉంటూ.. రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగానే గర్భవతి అయన చెల్లెమ్మ 108కి ఫోన్‌ చేసిన వెంటనే వాహనం అక్కడికి వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లడమే కాకుండా నాణ్యమైన సేవలు ఆస్పత్రిలో అందించి, డబ్ల్యూహెచ్‌ఓ, జీఎంపీ ప్రమాణాలు కలిగిన మందులు కూడా వారి చేతిలో పెడుతున్నాం. ఇంటికి వెళ్లేటప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి, వారు ఇబ్బంది పడకుండా ఉండేందుకు, సిజేరియన్‌ అయితే రూ.3వేలు, సహజ ప్రసవం అయితే రూ.5వేలు ఆరోగ్య ఆసరా కింద విశ్రాంతి సమయంలో కూడా తోడుగా ఉండేందుకు ఈ మొత్తాన్ని చెల్లెమ్మ చేతిలో పెట్టి.. ఆమెను ఈ తల్లీబిడ్డ ఎయిర్‌ కండిషన్డు వాహనంలోనే ఇంటివరకు పంపించి, వారికి అన్నిరకాలుగా తోడుగా ఉండే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. గతంలో ఎలాంటి పరిస్థితి ఉండేదో మనమంతా చూశాం. అరకొరగా ఉండే వాహనాలు, అదీ ఒక్కొక్కసారి అందుబాటులో లేని పరిస్థితి ఉండేది. ఉన్నవాటిలో కూడా వసతులు సరిగా లేని పరిస్థితుల నుంచి పూర్తిగా మెరుగైన పరిస్థితుల్లోకి తీసుకువస్తున్నాం. 104, 108 వాహనాలతో పాటు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ను నాడు`నేడు పనులతో మెరుగుపర్చడంతో పాటు మొత్తం ఆస్పత్రి వ్యవస్ధల రూపురేఖలు మార్చుతున్నాం. వీటన్నింటితో అక్కచెల్లెమ్మలకు ఇంకా మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నానన్నారు. దేవుడు ఇంకా మంచి చేసే అవకాశం ఇవ్వాలని మనసారా కోరుకుంటూ… అక్కచెల్లెమ్మలకు ఇంకా మంచి జరగాలని ఆరాటపడుతూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నానన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి (వైద్యఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీకృష్ణశ్రీనివాస్‌(నాని), పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, సివిల్‌ సఫ్లైస్‌ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌, ఆరోగ్య కుటుంబసంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ పలువురు ప్రజా ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

దక్షిణ మధ్య రైల్వేలో ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ గా బాధ్యతలు స్వీకరించిన కె. పద్మజ , ఐఆర్‌టిఎస్‌

-దక్షిణ మధ్య రైల్వేలో మొట్ట మొదటి మహిళా ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ విజయవాడ,  నేటి పత్రిక ప్రజావార్త : …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *