Breaking News

దాతల ఆర్ధిక సహాయంతో ఆయుర్వేద వైద్యశాలలో బోరెవెల్‌, వాటర్‌కూలర్‌ ఏర్పాటు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డా.ఆచంట లక్ష్మీపతి ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి ప్రాంగణంలో శుక్రవారం కొత్తగా వేసిన బోరెవెల్‌, వాటర్‌కూలర్‌ ప్రారంబోత్సవం జరిగింది. రోగులకు నీటి కొరత లేకుండా మెరుగైన సేవలు ఆందించే ఉద్దేశంతో, దాత కళాశాల పూర్వ విద్యార్ధి డాక్టర్‌ సిహెచ్‌.రామకృష్ణ ఇచ్చిన లక్ష రూపాయల ఆర్ధిక సహాయంతో ఆసుపత్రి ప్రాంగణంలో నూతనంగా మోటార్‌ బోరెవెల్‌ వేయించడం జరిగింది. అలాగే ఆసుపత్రి ప్రాంగణంలో రోగుల అవసరార్థం వాటర్‌కూలర్‌ని డాక్టర్‌ వేముల భానుప్రకాశ్‌ సహకారంతో ఏర్పాటుచేశారు. ఈ సందర్బంగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జె.ధనంజరావు, ఆయుర్వేద కాలేజి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సాయి సుధాకర్‌, చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ జె.రాజరాజేశ్వరి మాట్లాడుతూ ఆసుపత్రిలో ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటలవరకు స్పెషలిస్ట్‌ వైద్యులతో అన్నిరకాల వ్యాధులకు ఓ.పి. సేవలు రోగులకు అందించబడునన్నారు. మెరుగైన సేవలు అందించడానికి ఆర్ధిక సహాయంచేసిన డాక్టర్‌ రామకృష్ణ, డా.భానుప్రకాష్‌లకు వైద్యులు ఆసుపత్రి సిబ్బంది ధన్యవాదాలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ వైద్యాధికారులు డాక్టర్‌ కృష్ణవేణి, డాక్టరు శ్రీనివాస్‌, డాక్టర్‌ శ్రీనివాస్‌ నాయక్‌, డా సుమిత్ర, డాక్టర్‌ పద్మజ, డాక్టర్‌ లత, డాక్టర్‌ కీర్తి గ్రేసీ, డాక్టర్‌.సరయ్‌ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంద్రకీలాద్రి పై సంక్రాంతి వేడుకలు 2 వ రోజు…

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : తేదీ. 13-01-2025 నుండి తేదీ. 15-01-2025 వరకు సంక్రాంతి వేడుకలు సందర్బంగా మంగళవారం  ‘సంక్రాంతి’ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *