ఉగాది పచ్చడి షడ్రుచుల కలిసి ఉన్నట్లే జీవన విధానంలో ఉండే సుఖః దుఖః లతో కూడిన సత్యాన్ని తెలియ చేస్తుంది… : మంత్రి తానేటి వనిత

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
మన తెలుగు వారి ఇంట పచ్చి వాటితో చేసే ఉగాది పచ్చడి షడ్రుచుల కలిసి ఉన్నట్లే జీవన విధానంలో ఉండే సుఖః దుఖః లతో కూడిన సత్యాన్ని తెలియ చేస్తుందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. శనివారం స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో దొర్భాల ప్రభాకర శర్మ వారిచే ప్రవరించిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, మీ జీవితంలో ఈ ఉగాది నుంచి మరింతగా సంతోషాన్ని నింపాలని ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను ప్రజలకు అందచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు తో మరింత ప్రయోజనం పొంది ఆనందోత్సవాలు పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటూ శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఆమె తెలిపారు. ఉగాది అనే పదం యుగాది అనే పదం నుండి వచ్చిందని పంచాంగకర్త దొర్భాల ప్రభాకర శర్మ పేర్కొన్నారు. శుభకృత్ నామ కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులపై పంచాగశ్రవణాన్ని చేశారు. అక్షయ పాత్ర శ్రీనివాస్ రవీంద్ర, రష్మిత దంపతుల ఆధ్వర్యంలో మంత్రి క్యాంప్ కార్యాలయం లో ఉగాది సందర్బంగా దొర్బల ప్రభాకర శర్మ వారి పంచాంగ శ్రవణం. ఈ కార్యక్రమానికి జెడ్పిటిసి బొంతా వెంకటలక్ష్మి, ఏ. యం. సి. ఛైర్మెన్, వల్లభ శెట్టి శ్రీనివాస్, జిల్లా పరిషత్ వైస్ ఛైర్పర్సన్, పోసిన శ్రీలేఖ,మునిసిపల్ ఛైర్ పర్సన్ బావన రత్నకుమా రి, మునిసిపల్ వైస్ ఛైర్ పర్సన్ లు మన్నే పద్మ, గం డ్రోతు అంజ లీ దేవి, మాజి ఎమ్మెల్సీ కోడూరి శివరామ కృష్ణ, అక్షయ పాత్ర శ్రీనివాస్ రవీంద్ర, రష్మిత, ఆర్. భాస్కర రావు, పలువురు కౌన్సిలర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

దక్షిణ మధ్య రైల్వేలో ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ గా బాధ్యతలు స్వీకరించిన కె. పద్మజ , ఐఆర్‌టిఎస్‌

-దక్షిణ మధ్య రైల్వేలో మొట్ట మొదటి మహిళా ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ విజయవాడ,  నేటి పత్రిక ప్రజావార్త : …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *