విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు పొట్నూరి. శ్రీనివాసరావు, ఏలూరు. సాయి శరత్ , కె ఎస్ ఎన్ మూర్తి, నూనె సోమశేఖర్, రాజా నాయుడు మరియు రామ నాయుడు ఆధ్వర్యంలో ఉగాది పర్వదిన సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ పాల్గొన్నారు. పూజా కార్యక్రమం నిర్వహించిన అనంతరం పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని మృత్యుంజయ శర్మ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. అధిపతి శని అయి వున్నందున ఈ ఏడాది కూడా ప్రజలకు కష్టాలు ఇబ్బందులు తప్పవని, సకాలంలో వర్షాలు కురిసినా పంటలు పెరిగిన ధరల మాత్రం విపరీతంగా పెరుగుతాయని, జనసేన పార్టీకి ప్రజల్లో ఆదరణ విపరీతంగా పెరుగుతోందని , ప్రజలకు పవన్ కళ్యాణ్ గారి పట్ల సంపూర్ణ విశ్వాసం ఏర్పడుతుందని, జనసేన పార్టీ ప్రజల్లో మరింత విశ్వాసాన్ని చూరగొoటుదని, తద్వారా పార్టీ నాయకులకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో మహేష్ గారికి రాజ్యపూజ్యం బాగా పెరుగుతుందని ఆదాయం బాగా ఉంటుందని ప్రజల్లో ఆదరణ బాగా పెరుగుతుందని తెలిపారు.
Tags vijayawada
Check Also
ఇంద్రకీలాద్రి పై సంక్రాంతి వేడుకలు 2 వ రోజు…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : తేదీ. 13-01-2025 నుండి తేదీ. 15-01-2025 వరకు సంక్రాంతి వేడుకలు సందర్బంగా మంగళవారం ‘సంక్రాంతి’ …