-కుల మతాలకు అతీతంగా ‘హలీమ్’
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కస్టమర్లు కోరుకునే విధంగా రుచికరమైన మేలురకమైన హలీమ్ ను రంజాన్ సందర్భంగా ఉపవాస ముస్లిం సోదరులకు, నగరవాసులకు అందిస్తున్నామని ‘సలీం హలీమ్’ యజమాని సయ్యద్ సలీమ్ తెలిపారు. ఉగాది రోజున పంజా సెంటరులో ప్రారంభించారు. ఈ సందర్భంగా పశ్చిమ నియోజక వర్గంలో నగర సుపరిచితులు, 54 డివిజన్ టీడీపీ ప్రెసిడెంట్ సయ్యద్ సలీమ్, మైనార్టీ నాయకులు షేక్ తాజుద్దీన్ లు మాట్లాడుతూ నగరవాసులకు సరిక్రొత్త రుచులుతో హలీమ్, దమ్ చికెన్, పాయ, తండూరి, దమ్ బిర్యానీ, టిక్కా, కె.ఎఫ్.సి. చికెన్, స్పెషల్ స్వీట్, అనేక రకాల బిర్యానీలను అందిస్తున్నామన్నారు. గత 25 సంవత్సరాల నుండి క్వాలిటీ కోసం వివిధ ప్రాంతాల నుండి దినుసులు, సరుకులు రేటుతో రాజీ పడకుండా కొనుగోలు చేసి అందుబాటు ధరలతో క్వాలిటీకి, రుచి, శుచికి రాజీపడకుండా హలీమ్, దమ్ చికెన్, పాయ, తండూరి, దమ్ బిర్యానీ, టిక్కా, కె.ఎఫ్.సి. చికెన్, స్పెషల్ స్వీట్, అనేక రకాల బిర్యానీలను అందిస్తున్నామన్నారు. కస్టమర్లకు హోమ్ పార్సిల్ వెసులుబాటును కల్పిస్తున్నామని తెలిపారు. మాకు హిందూ, ముస్లిం సోదరులు పర్మినెంట్ కస్టమర్లు ఉన్నారన్నారు. మాకు ఎవరూ పోటీ కాదు. మేము ఎవరికీ పోటీ లేదన్నారు. కష్టమర్లు మాదేవుళ్ళు అని అన్నారు. రంజాన్, ఉగాది, శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.