విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అవినీతికి తావులేకుండా కుల మత రాజకీయాలకు అతీతంగా వాలంటీర్ల వ్యవస్థ పనిచేస్తుందని రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు.
స్థానిక తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో గురువారం నిర్వహించిన గ్రామ, వార్డు వాలంటీర్ల సేవలకు పురస్కారాల ప్రదానోత్సవం కార్యక్రమానికి దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ విప్, శాసనసభ్యులు సామినేని ఉదయభాను, రక్షణ నిధి, మల్లాది విష్ణువర్ధన్, జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, మున్సిపల్ కమీషనర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటి మేయర్లు బెల్లం దుర్గ, అవుతూ శ్రీ శైలజా రెడ్డి, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు మరియు పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ముఖ్య అతిధి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాలన గ్రామ వార్డు సచివాలయాల పరిధిలోనే జరుగుతున్నాయన్నారు. వ్యవస్థకు కీలకమైన వాలంటీర్లకు నేడు చక్కటి పురస్కారం అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత ఏడాది దీనిని ప్రారంభించారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలని వాలంటీర్ల ద్వారానే ప్రజలకు చేరువ చేసేలా ఇటువంటి వ్యవస్థను ముఖ్యమంత్రి రూపొందించారని మంత్రి అన్నారు. ఈ వ్యవస్థతో ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి గుర్తింపు రావడంతో పాటు ఈ వ్యవస్థతో పాలుపంచుకుంటున్న వాలంటీర్లకు కూడా గుర్తింపు వస్తుందని దాని వలనే ప్రభుత్వానికి మంచి పేరు రావడం జరుగుతుందన్నారు. ప్రభుత్వమంటేనే వాలంటీర్లు -వాలంటీర్లంటే ప్రభుత్వమని” అని ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకుని సంక్షేమ పథకాలను ప్రతీ లబ్దిదారునికి అందించాలని మంత్రి అన్నారు.
జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు మాట్లాడుతూ వాలంటీర్లు అందించిన సేవలు, కొలమానం అధారంగా ఉత్తమ వాలంటీర్లను ఎంపిక చేయటం జరిగిందని అన్నారు. నూతన ఎన్టీఆర్ జిల్లాలో 9,189 మంది వాలంటీర్లు జిల్లాలో పనిచేస్తున్నారన్నారు. వీరిలో 35 మందికి సేవ వజ్ర అవార్డు, 131 మందికి సేవ రత్న అవార్డు, 9023 మందికి సేవ మిత్ర అవార్డులు అందించడం జరిగిందని, దీంతోపాటు సరిఫికేట్లు, బ్యాడ్జ్, శాలువతో సంత్కరించడం జరిగిందన్నారు. అవార్డులు ముఖ్యం కాదని ప్రతీ వాలంటీరు సమానమనే ఉద్దేశంతో పనిచేయాలని కలెక్టర్ అన్నారు. ఈ వాలంటీర్ల వ్యవస్థ ఉత్తర అమెరికా, యూరఫ్ ఖండాలలో గొప్పగా ప్రజలకు చేరువయిందన్నారు. తెల్లవారుజామునే ఇంటింటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేస్తున్నారన్నారు. పెన్షను పంపిణీ చేసేటప్పుడు వృద్ధులు, ఆనారోగ్యంతో బాధపడుతున్నవారందరు వాలంటీర్లను దేవునితో కొలుస్తున్నారని అన్నారు. కోవిడ్ మొదటి, రెండు దశల సమయంలో కూడా బయపడకుండా సేవలు అందించారన్నారు. అలాగే ఈ మధ్య కాలంలో వాలంటీర్ల వ్యవస్థ వచ్చిన తరువాత పని వత్తిడి తగ్గిందని, గతంలో రెవెన్యూ పరమైన అవసరాల కోసం ముఖ్యంగా వారికి కావాల్సిన వివిధ సర్టిపికేట్ల కోసం లబ్ధిదారులు నెలల తరబడి తిరిగే వారని ఈ వ్యవస్థ ఏర్పాటుతో అనతి కాలంలోనే లబ్దిదారులకు సంక్షేమ పథకాలు సకాలంలో అందుతున్నాయన్నారు. ప్రభుత్వం అందిస్తున్న 33 పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో వాలంటీర్ల గుర్తింపు కనబడుతుందని కలెక్టర్ తెలిపారు.
స్థానిక శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో వాలంటీర్ల వ్యవస్థ కీలకంగా ఉందన్నారు. ప్రతీ 50 కుటుంబాలకు ఒక వాలంటీర్, 2వేల జనాభాకు సచివాలయం ఏర్పాటు చేసి సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను ప్రజలకు వివరిస్తున్నారన్నారు. ఉత్తమ వాలంటీర్లను రెండు సంవత్సరాలుగా సత్కరిస్తున్నామన్నారు. కరోనా కష్ట కాలంలో ప్రాణాలకు తెగించి వాలంటీర్లు సేవలు అందించారని కోనియాడారు. వాలంటీర్ల వ్యవస్థ ప్రభుత్వానికి రెండు కళ్ళు లాటివి అన్నారు. అవార్డులు అందుకున్న వాలంటీర్లు ఉత్తమ సేవలందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని శాసనసభ్యులు అన్నారు.
అనంతరం నగర పాలక సంస్థ పరిధిలోని 15 మంది వార్డు వాలంటీర్లకు సేవవజ్ర, 34 మంది వార్డు వాలంటీర్లకు సేవరత్న, 76 మంది వార్డు వాలంటీర్లకు సేవమిత్ర అవార్డులను ప్రధానం చేశారు. నగర పాలక సంస్థ సర్కిల్ -2 పరిధిలోని వార్డు 1లో పనిచేస్తున్న అన్నెం అంజని వాలంటీర్ మాట్లాడుతూ సేవ వజ్ర అవార్డు అందుకోవడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. తన పరిధిలోని వార్డు సచివాలయంలో 70 కుటుంబాల వరకు ఉన్నాయన్నారు. వీరికి ప్రభుత్వ పధకాలను గడపగడపకు చేరువ చేస్తున్నానన్నారు. ప్రతీ నెల ఒకటోవ తేదీన ఉదయం 5:30 గంటలకే పెన్షన్ పంపిణీ చేస్తున్నానని, కరోనా సమయంలో కుటుంబంలోని ప్రతీ ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించానని, జ్వరంతో బాధపడుతున్న వారిని ఆసుపత్రిలో చేర్చి వైద్యాన్ని అందించానన్నారు.
ఈ కార్యక్రమంలో నవరత్నాలు వైస్ చైర్మన్ టివిఎస్ మూర్తి, ఏపిఆర్‌టిసి జోనల్ చైర్ పర్సన్ తాతినేని పద్మావతి, ఏపి ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి, కాపు కార్పొరేషన్ చైర్మన్ ఆడపా శేషగిరి, గ్రందాలయము చైర్మన్ టిప్పరమల్లి జమలపూర్ణమ్మ, విశ్వబహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్, బట్రాజ్ కార్పొరేషన్ చైర్మన్ కె. గీతాంజలిదేవి, స్థానిక కార్పొరేట్ పాల్గొన్నారు.