-అనూరిజం ను అశ్రద్ధ చేస్తే ప్రాణాలకే ప్రమాదం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్లిష్టమైన బృహద్ధమని సంబంధ అనూరిజం వ్యాధిని టాప్ స్టార్స్ హాస్పిటల్ వైద్య బృదం విజయవంతంగా శస్త్రచికిత్సను నిర్వహించారని సీనియర్ సర్జన్ డాక్టర్ అరుణ్ కుమార్ హరిదాస్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఓ హోటల్ నందు అనూరిజం చికిత్స పై విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బృహద్ధమని సంబంధిత అనూరిజం వ్యాధి సాధారణంగా వృద్ధుల్లో ఎక్కువగా సంభవిస్తుందని, సరైన చికిత్స చేయకపోతే అనూరిజం వ్యాధి వల్ల బృహద్దమని లో రక్తనాళాలు పగిలి పోవడం వల్ల ఎక్కువమంది అకస్మాత్తుగా మరణిస్తారని తెలిపారు.భారీ అనూరిజం ఏర్పడితే ఛాతీలో ఏ క్షణాన ధమనిలో ఉన్న రక్తనాళాలన్నీ బాగా ఉబ్బి టైంబాబులా పగిలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు.అలాగే గుండెల్లో బ్లాక్స్ కారణంగా ఇంకా రోగి బలహీనంగా ఉన్నట్లయితే శస్త్రచికిత్సలో కూడా ప్రమాదం ఎక్కువగా ఉంటాయని తెలిపారు.ఇలాంటి ఒక కేసు తమ హాస్పిటల్ దృష్టికి వచ్చిందని 67 సంవత్సరాల ఓ వ్యక్తి చుక్క నీరు మింగలేని పరిస్థితుల్లో అనారోగ్యంతో తమ హాస్పటల్ కి వచ్చారని తెలిపారు. అతనికి అన్ని వైద్య పరీక్షలు నిర్వహించగా అతని ఎడమ వైపు ఛాతిలో బృహద్ధమని రక్తనాళం పెద్ద సైజు లో ఉబ్బి ఉన్నట్లు నిర్ధారించబడినదని దానివలన అతను ఏ రకమైన ద్రవ, ఘన పదార్థాలు తీసుకోకపోవడంతో చాలా ఇబ్బంది గా పరిస్థితి మారిందన్నారు.అతనికి వివిధ హాస్పిటల్స్ లో 25శాతం నుండి 30శాతం వరకే బ్రతికే అవకాశాలు ఉంటాయని అతని బంధువులు తెలపడంతో అతని విషమ పరిస్థితిని చూసి అతనికి శస్త్రచికిత్సను తక్కువ ఖర్చుతో అందించి ప్రమాదం నుండి తమ వైద్య బృందం రక్షించామని తెలిపారు. ఇటువంటి శస్త్రచికిత్సల్లో అనూరిజం తొలగించేటప్పుడు మెదడు, మూత్రపిండాలు, వెన్నుపాముకు రక్తప్రసరణ నిర్వహించడం వంటివి చేస్తామని, అనూరిజం ను విడదీసేటప్పుడు రక్త ప్రసరణ ఆపటం వంటివి జరుగుతూ ఉంటాయని చాలా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొని శస్త్ర చికిత్సను విజయవంతం చేశామన్నారు.రోగి కుమార్తె మాట్లాడుతూ తన తండ్రి రోగాన్ని ఏ డాక్టర్ నయంచేయక పోతే చెన్నై కి తీసుకెళ్తామని అనుకున్నామని తన శ్రేయోభిలాషులు ద్వారా డాక్టర్ అరుణ్ కుమార్ గురించి తెలుసుకుని టాప్ స్టార్స్ హాస్పిటల్ లో చేర్పించామని తెలిపారు.తన తండ్రికి తక్కువ ఖర్చుతో శస్త్ర చికిత్సను నిర్వహించి ప్రాణాలు నిలిపారని కొనియాడారు. ఇప్పుడు తన తండ్రి పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని బాగా మాట్లాడుతున్నారని తెలిపారు. సమావేశంలో టాప్స్ స్టార్స్ గుండె వైద్య నిపుణులు వై. శ్రీనివాస్, వైద్య బృందం పాల్గొన్నారు.