అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ జగన్ మంత్రి వర్గం లో వరుసగా రెండోసారి కూడా మంత్రి పదవి దక్కించుకున్న మైనారిటీ శాఖ మంత్రి అంజద్ బాషా ను అహఁలే సున్నత్ జమాత్ బృందం కలిసి శుభాకాంక్షలు తెలియజేసింది. అహఁలే సున్నత్ జమాత్ కన్వీనర్ అల్తాఫ్ రజా నేతృత్వంలోని బృందం మంగళవారం ఉదయం మంత్రి అంజద్ బాషా ఇంటికి వెళ్లి కలిసింది. మైనారిటీ శాఖ మంత్రి గా తిరిగి ఎంపిక అయిన అంజద్ బాషా కు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం శాలువాతో సత్కరించారు. సీఎం జగన్ అంజద్ బాషా కు రెండోసారి కూడా మైనారిటీ శాఖ మంత్రి గా అవకాశం ఇవ్వడం సంతోషం కలిగించిందని చెప్పారు. మైనారిటి శాఖ మంత్రి తో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వడం నిజంగా గర్వించదగ్గ విషయం అన్నారు. ముస్లిం మైనారిటి వర్గాల పట్ల సీఎం కు ఉన్న అభిమానానికి ఇది నిదర్శనమని చెప్పారు. గడచిన మూడేళ్ళుగా మైనారిటీల అభ్యున్నతి కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా విశేష కృషి చేసారని , రాబోయే రెండూళ్లలో కూడా ఇదే రకమైన కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేసారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి వాహిద్ సోషల్ వర్కర్ రామారావు జాహ్నవి శీను భాషా తదితరులు పాల్గొన్నారు.
Tags amaravathi
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …