Breaking News

విద్య, వైద్యం, వ్యవసాయ, గృహనిర్మాణం తదితర కీలక రంగాల్లో తీసుకొచ్చిన మార్పులు చరిత్రాత్మకం:.. : సీఎం జగన్‌


-వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం  వైయస్‌.జగన్‌ సమీక్ష…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆరోగ్యశ్రీ ఆసుపత్రులలో ఏర్పాటు చేయనున్న సమాచార కియోస్క్‌ మోడల్‌ను ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పరిశీలించారు. ఆరోగ్యశ్రీలో మరింత సులువుగా వైద్య సేవలు పొందడం ఎలా అనే విధంగా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. మంగ‌ళ‌వారం తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం వైయ‌స్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులను అధికారులు సీఎంకు వివరించారు. డైలీ యాక్టివిటీ రేటు 0.13శాతానికి గణనీయంగా పడిపోయిందని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కీలక కామెంట్స్ చేశారు. ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని స్పష్టం చేశారు. ప్రజలకు మంచి జీవన ప్రమాణాలు అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ, గృహనిర్మాణం రంగాల్లో తీసుకొచ్చిన మార్పులు చరిత్రాత్మకం అని వెల్లడించారు. విలేజ్‌ / వార్డు క్లినిక్స్‌, టీచింగ్‌ ఆస్పత్రుల్లో నాడు – నేడు కింద అభివృద్ధి పనులు చేపడుతున్న విషయాన్ని గుర్తుచేశారు. ఆరోగ్య శ్రీ కింద ఎలాంటి పెండింగ్‌ బిల్లులు లేకుండా ఎప్పటికప్పుడు చెల్లింపులు జరుపుతున్నట్లు చెప్పారు. ఆరోగ్య శ్రీ కింద చికిత్సల సంఖ్యను గణనీయంగా పెంచామన్నారు. కొత్తగా 16 టీచింగ్‌ ఆస్పత్రులను తీసుకువస్తున్నట్లు జగన్ చెప్పారు. లక్ష్యాలను అందుకునేందుకు అధికారులు యజ్ఞంలా పనిచేయాలన్నారు. ప్రజలకు తప్పకుండా వైద్యుల సేవలు అందుబాటులో ఉండేందుకు గతంలో జీతాలు పెంచుతూ కొన్ని నిర్ణయాలు తీసుకుని ఆమేరకు వారికి జీతాలు ఇచ్చేలా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. అందుకనే ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌పై నిషేధం విధించామని సీఎం జగన్‌ తెలిపారు. ఇక వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై సీఎం ఆరా తీశారు. మే నెలాఖరు నాటికి అన్ని నియామకాలు పూర్తిచేయాలని సూచించారు. 16 మెడికల్‌ కాలేజీల్లో 6 చోట్ల జోరుగా నిర్మాణాలు సాగుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆస్పత్రుల్లో సౌకర్యాలను, సదుపాయాలను పర్యవేక్షించాలని అధికారులకు సీఎం సూచించారు. టాయిలెట్ల దగ్గర నుంచి ప్రతి విభాగం పరిశుభ్రంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆరోగ్యశ్రీలో అవసరమైన మేరకు ఇంకా ప్రొసీజర్లను పెంచాలనుకుంటే పెంచాలని సూచించారు. ప్రతిభ ఆధారంగా వాలంటీర్ల మాదిరిగా ఆరోగ్య మిత్రలకు కూడా నగదు ప్రోత్సహకాలు ఇవ్వాలని… సీఎం అధికారులకు సూచించారు. దీని ద్వారా ఆరోగ్య మిత్రల సేవలనూ గుర్తించినట్టు అవుతుందని చెప్పారు. ఏడాదిలో ఒక రోజు ఎంపిక చేసి, ఆరోజు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌ సూచించారు. సమీక్షా సమావేశానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఆర్‌ అండ్‌ బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి (కోవిడ్‌ మేనేజిమెంట్‌ అండ్‌ వ్యాక్సినేషన్‌) ముద్దాడ రవిచంద్ర, ఆరోగ్యశ్రీ సీఈఓ వి.వినయ్‌చంద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌రెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజర‌య్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి

-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *