విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ పరిధిలోని కృష్ణలంక వాసవి కల్యాణ మండపంలో 20,21మరియు 22 డివిజన్ల లోని సచివాలయాలలో ఏర్పాటు చేసిన వలంటీర్ల ప్రోత్సాహక పురస్కారాల కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పాల్గొని, వాలంటీర్లకు పురస్కారాలు అందించిన తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్. అవినాష్ మాట్లాడుతూ భారత దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వాలంటీర్ల వ్యవస్థతో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కి దక్కుతుందని, కరోనా మహమ్మారి సమయంలో పింఛన్ల పంపిణీ లో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో వాలెంటీర్లు నిరంతరం కష్టపడుతున్నారు అని అన్నారు.రాష్ట్రంలో పని చేస్తున్న ప్రతి వాలంటీర్ సేవా వజ్రమే, ప్రతి ఏటా కొంతమందిని ప్రోత్సాహించేందుకే రాష్ట్ర ప్రభుత్వం సేవా వజ్ర,సేవా రత్న, సేవా మిత్ర పురస్కారాలు అందిస్తోందన్నారు. ప్రతి ఒక వాలంటీర్ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అందించటమే ధ్యేయంగా పని చేయాలని అవినాష్ సూచించారు.చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై, ప్రజలందరి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి అని కోరారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని నాతో పాటు,లక్షలాది మంది ప్రజలు సమర్దిస్తున్నారని,రాబోయే 30 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి గా ఉంటారని ఉద్ఘటించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,22వ డివిజన్ కార్పొరేటర్ తాటిపర్తి కొండారెడ్డి,కృష్ణాజిల్లా మాజీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మీర్ హుస్సేన్,మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చెల్లారావు, గాంధీ కోపరేటివ్ బ్యాంక్ డైరక్టర్ జోగా రాజు,మార్కెట్ యార్డ్ డైరక్టర్ విజయలక్ష్మి, కృష్ణలంక శివాలయం ఛైర్మెన్ సుబ్బారెడ్డి, వైస్సార్సీపీ నాయకులు ఎస్.కె సుభాని,పళ్లెం రవి,పుప్పాల రాజా,దుర్గారావు,రఫీ మరియు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
తూర్పు నియోజకవర్గంలో పరిటాల ఓంకార్ కల్యాణ మండపంలో 3, 4, 5, 10 మరియు 11 డివిజన్ల లోని సచివాలయాలలో ఏర్పాటు చేసిన వాలంటీర్ల ప్రోత్సాహక పురస్కారాల కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పాల్గొని, వాలంటీర్లకు పురస్కారాలు అందించిన తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ అవినాష్ ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, సీనియర్ నాయకులు కో ఆప్షన్ మెంబెర్ ముసునూరి సుబ్బారావు, స్టాండింగ్ కమిటీ మెంబెర్ కలాపాల అంబెడ్కర్,3వ డివిజన్ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక, 4వ డివిజన్ ఇంచార్జ్ గల్లా పద్మావతి వైస్సార్సీపీ నాయకులు గల్లా రవి,చిత్రం లోకేష్,సందీప్,లామ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.