-ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ పరిధిలోని సచివాలయాల యొక్క నిర్వహణ విధానమును పరిశీలనలో భాగంగా నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ గురువారం బృందావన్ కాలనీ నందలి 85,86 & 87 వార్డ్ సచివాలయములను సందర్శించి అక్కడ అందుబాటులో గల రికార్డ్ లను పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇచ్చారు. సిబ్బంది అందరు సమయపాలన పాటిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా పని చేయాలనీ ఆదేశిస్తూ, వారి యొక్క పని విధానము అడిగితెలుసుకొన్నారు. క్షేత్ర స్థాయిలో వాలెంటిర్లల యొక్క పని విధానము, ప్రభుత్వ పథకములపై ప్రజలకు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమములు తదితర వివరాలను వార్డ్ పరిపాలన కార్యదర్శులను అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ పథకములు అన్నియు అర్హులైన వారికీ చేరువ చేసే విధంగా భాద్యతగా తమకు కేటాయించిన విధులు నిర్వహించాలని మరియు పథకముల వివరాలు అన్నియు ప్రజలకు చేరువ చేయాలనీ సూచిస్తూ, వివిధ కారణాలతో సచివాలయములకు వచ్చు ప్రజల సమస్యలను సానుకూలంగా తెలుసుకొని వారు సంతృప్తి చెందే విధంగా అవసరమగు సమాచారం అందించాలని అన్నారు. ప్రజల నుండి వచ్చిన సమస్యల అర్జీలను విధిగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి వాటిని సకాలంలో పరిష్కరించేలా చూడాలని ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకoగా నిర్వహిస్తున్న సచివాలయ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకున్నట్లు, నగరంలోని 64 డివిజన్ల పరిధిలో గల 296 సచివాలయాల పర్యవేక్షణ భాద్యతలను 32 మంది స్పెషల్ ఆఫీసర్లకు అప్పగిస్తూ, ఒక్కక్కోరికి రెండు డివిజన్లను కేటాయిస్తూ, సచివలయాలను సందర్శించి అక్కడ సిబ్బంది సక్రమముగా విధులు నిర్వహిస్తున్నది లేనిది పర్యవేక్షిస్తూ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వటం జరిగిందని వివరించారు. అదే విధంగా వారంలో మూడు రోజులు సచివాలయ సిబ్బంది మరియు వార్డ్ వాలంటీర్లతో సమీక్షిస్తూ, ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకములు అర్హులైన వారికీ అందించేలా చూడాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని వివరించారు.
పర్యటనలో స్పెషల్ ఆఫీసర్ డిప్యూటీ సిటి ప్లానర్ (ప్లానింగ్ ) జుబిన్ శిరన్ రాయ్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.