విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎండ తీవ్రతల దృష్ట్యా వడదెబ్బ తగలకుండా ప్రజలందరూ తగు జాగ్రత్తలు పాటించాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. భారత వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో గవర్నర్ పేట జె.డి.హాస్పిటల్ రోడ్డు కార్నర్ జైహింత్ కాంప్లెక్స్ వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారభించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. శరీరంలో నీటి సమతుల్యత కాపాడుకోవడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఇందుకోసం నీటి శాతం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిదన్నారు. వేసవి దృష్ట్యా పాదచారుల దాహార్తి తీర్చేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని.. ఈ చలివేంద్రాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో భారత్ వికాస్ పరిషత్ అధ్యక్షులు ఎం.వి.ఎస్.ఎన్.వి.ప్రసాద్, సెక్రటరీ బ్రహ్మానందం, ఏపీ సెక్రటరీ కమల్ నయన్ బంద్, రాష్ట్ర నాయకులు రామయ్య, నార్పత్ జైన్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …