బొబ్బూరి గ్రౌండ్స్‌లో జీవన్‌ సాగర్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభం…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భవానీపురంలోని కృష్ణానది ఒడ్డున వున్న బొబ్బూరి గ్రౌండ్స్‌లో జీవన్‌ సాగర్‌ ఎగ్జిబిషన్‌ను ఆదివారం రాత్రి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ విజయవాడ నగర ప్రజలకు ఈ ఎగ్జిబిషన్‌ మంచి వినోదాన్ని అందజేస్తుందన్నారు. ఎగ్జిబిషన్‌లో వివిధ రకాల స్టాల్స్‌ ఏర్పాటు చేయడంతోపాటు విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనగా ఈ ఎగ్జిబిషన్‌ను రూపొందించడం అభినందనీయమని అన్నారు. ఈ వేసవికాలంలో పిల్లలకు, పెద్దలకు మంచి వినోదాత్మకంగా ఎగ్జిబిషన్‌ సేవలు అందించాలని ఆయన నిర్వాహకులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్‌ నిర్వాహకులు మ్లాడుతూ గడ్డం అచ్చయ్య, నందివాడ గోపీనాథ్‌ మాట్లాడుతూ విజయవాడ నగరంలో మునిపెన్నడూ లేనంత రీతిలో ఈ ఎగ్జిబిషన్‌ అన్ని అంశాలతో రూపొందించడం జరిగిందన్నారు. సుమారు 100 మంది కళాకారులు 30 రోజులపాటు శ్రమించి దుబాయ్‌ సిటీ ముఖద్వారంతో ఎగ్జిబిషన్‌ రూపొందించడం జరిగిందని అన్నారు. అలాగే వివిధ దేశాలకు చెందిన కట్టడాలను ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఎగ్జిబిషన్‌లో వివిధ రకాల గృహోపకరణాలు, స్టాల్స్‌, రకరకాల ఎంటర్‌ టైన్‌మెంట్‌ గేమ్‌లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎగ్జిబిషన్‌లో ఇమిటెటేడ్‌ జ్యూవెలరీ, ఆట వస్తువులు, గేమ్స్‌స్టాల్స్‌, వివిధ రకాల ఆహార పదార్థాల స్టాల్స్‌ను ఏర్పాటుచేసినట్లు వివరించారు. అలాగే కుటుంబ సమేతంగా వినోదించేందుకు కొలంబస్‌, జెయింట్‌వీల్‌, డ్రాగన్‌ట్రైన్‌, ఎయిర్‌బౌన్సర్‌, మినీ ట్రైన్‌, హెలికాప్టర్‌, వాటర్‌బోట్‌ తదితరాలు ఎగ్జిబిషన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు యర్లగడ్డ ఆంజనేయరెడ్డి, గుడివాడ రాఘవ నరేంద్ర, పడిగపాటి చైతన్యరెడ్డి, ఎండి ఇర్ఫాన్‌, బొబ్బూరి శ్రీరామ్‌, బొబ్బూరి భూపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *