విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ వాణిజ్య సముదాయాలలోని షాపుల లీజుదారులు దీర్ఘకాలికoగా ఉన్న అద్దె బకాయిలను తక్షణమే చెల్లించాలని, అట్లు చెల్లించని యెడల బకాయిదారుల షాపులను సిజ్ చేయడమే కాకుండా చట్టరీత్య తగిన చర్యలు తీసుకోనుట జరుగునని ఎస్టేట్ ఆఫీసర్ కె.అంబేద్కర్ హెచ్చరించారు. నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ వారి ఆదేశాల మేరకు ఎస్టేట్ అధికారులు మంగళవారం గాంధీనగర్ నందలి గోవిందరాజులు వాణిజ్య సముదయములో ప్రత్యేక కలెక్షన్ డ్రైవ్ నిర్వహించి రూ. 7,72,016/- లు బకాయిలు వసూలు చేయుటతో పాటుగా దీర్ఘకాలికoగా అద్దె బకాయిలు కలిగియుండి ఎటువంటి చెల్లింపులు చెల్లించని 6 షాపులను రెవిన్యూ అధికారులు సిజ్ చేసినట్లు ఎస్టేట్ అధికారి తెలియజేసారు. ఈ సందర్భంలో నగరపాలక సంస్థ వాణిజ్య సముదాయాలలోని షాపుల లీజుదారులు ఎటువంటి బకాయిలు లేకుండా ప్రతి నెల అద్దెలు చెల్లించి నగరాభివృద్ధికి తోడ్పడాలని, అట్లు చెల్లించని వారిపై నిబంధనలకు అనుగుణంగా చట్టపరమైన చర్యలు తీసుకోనబడునని పేర్కొన్నారు. ఈ డ్రైవ్ నందు ఎస్టేట్ అధికారి అంబేద్కర్ తో పాటు రెవిన్యూ ఆఫీసర్ రాజకుమార్, రెవిన్యూ ఇన్స్పెక్టర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …