నూతన మార్గదర్శకలపై రెవెన్యూ అధికారులు అవగాహన కలిగి వుండాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మ్యుటేషన్‌ ధరఖాస్తులను పరిష్కరించడంలో నూతన మార్గదర్శకలపై రెవెన్యూ అధికారులు అవగాహన కలిగి వుండాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. స్థానిక కలెక్టర్‌ కార్యాలయం నుండి మంగళవారం మ్యుటేషన్‌ రిజక్షన్స్‌, రెవెన్యూ గ్రీవెన్స్‌, ఒటిఎస్‌పై కలెక్టర్‌ డిల్లీరావు, విజయవాడ సబ్‌ కలెక్టర్‌, నందిగామ, తిరువూరు ఆర్‌డివోలు, తహాశీల్థార్లతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న చిన్న కారణాలతో మ్యుటేషన్‌ ధరఖాస్తులను తిరస్కరించకూడదన్నారు. ఇటివల సిసిఎల్‌ఏ జారీ చేసిన నూతన మార్గదర్శకాలను పరిశీలించి పరిష్కరించాలన్నారు. వివిధ కారణాలతో తిరస్కరణకు గురి అవుతున్నాయని దీనిని దృష్టిలో పెట్టుకుని చీఫ్‌ కమీషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ ఎడ్మినిస్ట్రేషన్‌ (సిసిఎల్‌ఏ) మ్యుటేషన్‌ ప్రక్రియ పై జారీ చేసిన నూతన మార్గదర్శకాలపై తహాశీల్థార్లు అవగాహన కలిగి వుండాలన్నారు. వీటిలో ముఖ్యంగా ప్రభుత్వ అధీóనంలో ఉన్న భూమి యొక్క మ్యుటేషన్‌, మ్యుటేషన్‌కు ముందు సర్వే సబ్‌ డివిజన్‌ తప్పనిసరి అయిన సందర్భాలు రిజిస్టర్‌ చేయబడిన పత్రం ద్వారా నేరుగా కనెక్ట్‌ చేయబడిన రిజిస్టర్డ్‌ హోల్డర్‌ మరియు క్లెయిమెంట్‌ కేసులు, రిజిస్టర్డ్‌, రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్‌, ఇటీవలి సేల్‌/ గిఫ్ట్‌, పార్టీషన్‌ డిడ్‌ల సందర్భాలలో ఆటోమ్యూటేషన్‌, మ్యుటేషన్‌పై జారీ చేయవల్సిన పాస్‌బుక్‌, వారసత్వం కారణంగా మ్యుటేషన్‌ కేసులు తదితర అంశాలపై రెవెన్యూ అధికారులు అవగాహన కలిగివుండాలన్నారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌కుమార్‌, డిఆర్‌వో కె.మోహన్‌కుమార్‌ ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *