విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రంజాన్ ఇఫ్తార్ విందు ఏర్పాట్లను పరిశీలించిన డిప్యూటి సియం, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి అంజాద్ బాషా మంగళవారం నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఇఫ్తార్ విందు ఏర్పాట్లలను మాజీ మంత్రి శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్, సెంట్రల్ శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్, జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు, శాసన మండలి సభ్యులు ఎం.డి రుహుల్లా, నగర పోలిస్ కమీషనర్ టికె రాణాతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ఎస్ బి అంజాద్‌బాషా మాట్లాడుతూ ఈనెల 26వ తేది మంగళవారం స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ముస్లీమ్ సోదరులకు ఇఫ్తార్ విందు కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరు కానున్నారన్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 5వేల నుండి 6 వేల మంది వరకు హాజరు కానున్నారన్నారు. తమ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి పెద్ద పీఠ వేస్తూ ముస్లీంల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూన్నామన్నారు. ఎస్‌టి, ఎస్‌సి, బిసి మెనార్టీ వర్గాలకు నామినెట్ పదువులలో పెద్దపీట వేయడం జరిగిందన్నారు. గతంలో 2019 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఇఫ్తారు విందు ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. కొవిడ్ కారణంగా గత రెండు సంవత్సరాలుగా ఇఫ్లారు విందు ఏర్పాటు చేయడం జరగలేదని, ప్రస్తుతం కొవిడ్ తగ్గు ముఖం పట్టడంతో పవిత్ర రంజాన్ మాసంలో ముస్లీం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం ప్రభుత్వం ఆనావాయితీగా నిర్వహించనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనడం జరుగుతుందని అదే సమయంలో ముసిఫర్ ఖానాను ముఖ్యమంత్రి చేతుల మీదగా ప్రారంభించడం జరగుతుందని ఉప ముఖ్య మంత్రి ఎస్ బి అంజాద్‌బాషా అన్నారు.
ప్రభుత్వం పారదర్శకంగా అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి కుల, మత, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను నవరత్నాలు రూపంలో అమలు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ కాలంలో రంజాన్ తోఫా, సంక్రాంతి, క్రిస్టమస్ కానుకలు ప్రజలను మభ్యపెట్టి ముడుపుల కోసం ప్రవేశపెట్టిన కానుకలని ఉప ముఖ్యమంత్రి ఎస్ బి అంజాద్ బాషా అన్నారు.
ఏర్పాట్ల పరిశీలనలో సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్‌చంద్, ఏపి ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ పి. గౌతమ్‌రెడ్డి, డిసిపి మేరీ ప్రశాంతి, రాష్ట్ర మైనార్టీస్ ఫైనాస్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ షెర్ ఆసిఫ్, దుర్గ గుడి ఆలయ కమిటి చైర్మన్ పైలా సోమినాయుడు, జిల్లా మైనార్టీ కార్పొరేషన్ శాఖ అధికారి రియాజ్ సూల్తానా, ముస్లీమ్ మైనార్టీ నాయకులు ఉన్నారు.
Tags vijayawada
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …