బాటసారుల దాహార్తి తీర్చేందుకు దాతలు ముందుకు రావాలి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మండుతున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని పాదచారుల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. ఏలూరు రోడ్డులో ఫర్నీచర్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఎండలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో పాదచారులు, నగర ప్రజలు, ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారుల దాహం తీర్చేందుకు ఈ చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వీటి ఏర్పాటుకు ముందుకొచ్చిన ఫర్నీచర్ డీలర్స్ అసోసియేషన్ సేవలను కొనియాడారు. ప్రజలందరూ ఈ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఫర్నీచర్ డీలక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈ.దామోదర్ రావు, సెక్రటరీ రాజా, నాయకులు దమ్మాల మల్లి, బొడ్డు నళిని, నాడార్స్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *