విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ వాణిజ్య సముదాయాలలోని దీర్ఘకాలికoగా ఉన్న షాపు లీజుదారుల అద్దె బకాయిలను వసూలు చేయుటలో భాగంగా బుధవారం కాళేశ్వరరావు మార్కెట్ సముదాయంలో ఎస్టేట్ అధికారులు ప్రత్యేక కలెక్షన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ ప్రత్యేక కలెక్షన్ డ్రైవ్ నందు రూ. 4,32,000/- లు బకాయిలు వసూలు చేయుటతో పాటుగా దీర్ఘకాలికoగా అద్దె బకాయిలు కలిగియుండి ఎటువంటి చెల్లింపులు చెల్లించని 9 షాపులను రెవిన్యూ అధికారులు సిజ్ చేసినట్లు ఎస్టేట్ అధికారి తెలియజేసారు. ఈ డ్రైవ్ నందు ఎస్టేట్ అధికారి కె.అంబేద్కర్ తో పాటు రెవిన్యూ ఆఫీసర్ రాజకుమార్, రెవిన్యూ ఇన్స్పెక్టర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …