-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ ఛాంబర్ నందు కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, నగరంలో ట్రాఫిక్ నియంత్రణ మరియు సిగ్నల్ లైట్స్ ఆధునీకరణ పై చేపట్టవలసిన చర్యలపై పోలీస్ మరియు నగరపాలక సంస్థ అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేసారు. ఈ సందర్భంగా ప్రస్తుతం నగరంలో అందుబాటులో ఉన్న సిగ్నల్ లైట్స్ యొక్క వివరాలు మరియు వాటి పనితీరు, నిర్వహణ విధానము మొదలగు అంశాలను అధికారులను అడిగితెలుసుకొన్నారు. వీటితో పాటుగా ట్రాఫిక్ ఇంటలేజన్స్ సిస్టం సిగ్నల్ లైటింగ్ విధానమును పూర్తి స్థాయిలో అమలు చేయుటకు తగిన డి.పి.ఆర్ లను రూపొందించాలని సంబందిత అధికారులకు సూచించారు. పై సమావేశంలో DCP ట్రాఫిక్ i/c సర్కార్, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్), K. వెంకట సత్యవతి, ఎస్.ఇ పి.వి.కె భాస్కర్, సిటీ ప్లానర్ జీ.వి.ఎస్.వి ప్రసాద్, డిప్యూటీ సిటి ప్లానర్ (ప్లానింగ్ ) జుబిన్ శిరన్ రాయ్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.