-నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఒన్ టౌన్ పశ్చిమ రైల్వే స్టేషన్ ప్రాంతములోని (ముసాఫర్ ఖానా) షాదీ ఖానాను నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ అధికారులతో కలసి పరిశీలించి ప్రారంభానికి సంబందించి ఏర్పాట్లపై అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. షాదిఖానా ముందు ఉన్న కంపాక్టర్ బీన్స్ అక్కడ నుండి తొలగించుటతో పాటుగా అదే ప్రాంతములో గల యురినల్స్ శుభ్రపరచి వాడుకపు నీరు అంతయు అవుట్ లేట్ ద్వార డ్రెయిన్ కు అనుసందానం చేయాలనీ ఇంజనీరింగ్ మరియు ప్రజారోగ్య శాఖాధికారులను ఆదేశించారు. షాదిఖానా ఎదురుగా గల గోడకు వాల్ పెయింటింగ్ నిర్వహించాలని మరియు మఖ్యమంత్రివర్యుల పర్యటనకు సంబందించి రూట్ ఉన్న ఎలక్ట్రికల్ స్తంభముల, గోడలపై అంటించిన పోస్టర్స్ తొలగించి పరిసరాలు అన్నియు పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని, నెహ్రు రోడ్ నందలి కల్వర్ట్ స్లాబ్ లను సరిచేయాలని సంబందిత అధికారులకు సూచించారు. ముసాఫర్ ఖానా నుండి గాంధీ హిల్ వరకు రోడ్ అంచున కొండప్రాంతములో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి, డ్రెయిన్ శుభ్రం చేయాలని సూచిస్తూ, ముసాఫర్ ఖానా నందలి డోర్స్, ఫ్లోరింగ్ మరియు పెయింటింగ్ పనులను పర్యవేక్షిస్తూ, షాదిఖానా పరిసరాలు అన్నియు పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా వినాయక గుడి ఫ్లై ఓవర్ డివైడర్ నందలి గ్రీనరిని పరిశీలిస్తూ పాడైన డివైడర్ ఫెన్సింగ్ కు తగిన మరమ్మత్తులు నిర్వహించి అవసరమైన చోట్ల కొత్త మొక్కలు ఏర్పాటు చేసి పచ్చదనం పెంపొందించాలని అన్నారు. కెనాల్ రోడ్, లోబ్రిడ్జి లో పెయింటింగ్ రంగులు వెలిసిపోయినందున రి పెయింటింగ్ చేయించాలి మరియు డివైడర్ లకు కూడా పెయింటింగ్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతాభాయి, ఎస్.ఇ పి.వి.కె భాస్కర్, సిటీ ప్లానర్ జీ.వి.ఎస్.వి ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు నారాయణమూర్తి, హెల్త్ ఆఫీసర్ డా.సురేష్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.