-తెలుగుదేశం పార్టీ సభ్యత్వంతో ప్రతి ఒక్కరికి రూ.2 లక్షల ప్రమాద బీమా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుదేశం పార్టీ రెండేళ్లకు ఒకసారి చేపట్టే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా విజయవాడలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం జిల్లాలో తొలుత తన పార్టీ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకున్నారు. ఈ సందర్భంగా నెట్టెం రఘురాం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు-2022 కార్యక్రమాన్ని కేంద్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ప్రారంభించారని, జిల్లాలో తొలుత తాను తన సభ్యత్వాన్ని ఐటీడీపీ వారిచే పునరుద్ధరించుకోవడం జరిగిందన్నారు. ఎప్పటికప్పుడు అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకునే తెలుగుదేశం పార్టీ ఈసారి వినూత్నంగా ఎవరికి వారు తాము ఉన్న చోట నుంచే వారి మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ నుంచి వాట్సాప్, టెలిగ్రామ్, మన టీడీపీ యాప్‌ల ద్వారా సభ్యత్వ నమోదు చేసుకునే అవకాశం కల్పించిందన్నారు. దీని ద్వారా కొత్త సభ్యత్వం నమోదు, పాత సభ్యత్వం పునరుద్ధరించుకోవచ్చన్నారు, సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ రూ.2 లక్షల ప్రమాద బీమా అందిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శులు గన్నే ప్రసాద్ (అన్నా), సింహాద్రి కనకాచారి, పెందుర్తి శ్రీనివాస్, రాష్ట్ర బీసీ నాయకులు వీరంకి వెంకట గురుమూర్తి, కార్పొరేషన్ ఫ్లోర్‌లీడర్ నెలిబండ్ల బాలస్వామి, విజయవాడ పార్లమెంట్ ఉపాధ్యక్షులు లింగమనేని శివరాంప్రసాద్, ఐటీడీపీ విజయవాడ పార్లమెంట్ అధ్యక్షులు అద్దేపల్లి శివ, ఐటీడీపీ నాయకురాలు లలిత, పరిశపోగు రాజేష్, పొన్నం రవికుమార్, సొరేపల్లి రాధాకృష్ణ, గొల్లపూడి నాగేశ్వరావు, షేక్. ఆషా, బంకా నాగమణి, కోడూరు వాసు, నందమూరి నాగేశ్వరరావు మరియు తదితరులు పాల్గొన్నారు.