విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సుందర హరిత విజయవాడ – పారిశుధ్య వారోత్సవాలలో భాగంగా 3వ రోజైన శనివారం నగర పరిధిలోని 64 డివిజన్లలో కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ వారి ఆదేశాల మేరకు ప్రజారోగ్య అధికారులు, స్పెషల్ ఆఫీసర్లు స్థానిక కార్పొరేటర్లను మరియు ప్రజాభాగస్వామముతో వారోత్సవాలు నిర్వహించారు. డివిజన్ పరిధిలో జీరో గర్బేజ్, వాల్ పెయింటింగ్ మరియు ప్లాంటేషన్ కార్యక్రమాలు నిర్వహించారు. చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతాభాయి సూచనలకు అనుగుణంగా శానిటరీ ఇన్ స్పెక్టర్లు వారి వారి డివిజన్ పరిసరాలు పరిశుభ్రత కార్యక్రమము చేపట్టి విధులలో ఎక్కడ ఏవిధమైన చెత్త లేదా వ్యర్దములు లేకుండా జీరో గార్బేజ్ విధానము పాటించారు. అదే విధంగా ప్రతి ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలపై చర్చించి వారిని పరిష్కరించుటకు చర్యలు తీసుకోవటం జరిగింది.
Tags vijayawada
Check Also
ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి
-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …