ముఖ్యమంత్రి  టూర్ ప్రోగ్రామ్ ప్రాంతాల పరిశీలన అధికారులకు పలు ఆదేశాలు…

-నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ అధికారులతో కలసి పండిత్ నెహ్రు బస్ స్టేషన్, స్వర్గపురీ రోడ్, కృష్ణవేణి ఘాట్, లో బ్రిడ్జి, ప్రకాశం బార్రేజి రోడ్, కెనాల్ రోడ్ నుండి బి.ఆర్.పి రోడ్, నెహ్రు రోడ్, కె.జీ మార్కెట్, లోబ్రిడ్జి, యం.జీ రోడ్ మీదగా ఇంద్రిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు గల రోడ్లను పరిశీలిస్తూ ఆయా రోడ్లలో చిన్న చిన్న గోతులకు తక్షణమే ప్యాచ్ వర్క్ పనులు నిర్వహించాలని సంబందిత అధికారులను ఆదేశించారు. ఆయా ప్రాంతాలలో పర్యటించిన సందర్భంలో చాలా రోడ్డులో ఉదయం 6.00 గంటలు అయినప్పటికీ ఇంకను పారిశుధ్య పనులు ప్రారంభించక పోవుట గమనించి ప్రతి రోజు ఉదయం 5.45 కల్ల శానిటేషన్ పనులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. పండిత్ నెహ్రు బస్ స్టేషన్ ముందు గల లో బ్రిడ్జి (RUB) కాంపౌండ్ వాల్ కి పెయింటింగ్స్ నిర్వహించుట మరియు అదే ప్రాంతములోని డ్రెయిన్ నందు సిల్ట్ తొలగింపు పనులు చేపట్టి పరిసరాలు అన్నియు పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని మరియు డ్రెయిన్ పై స్లాబ్ లను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులకు సూచించారు.

రాజీవ్ గాంధి పార్క్ లో పార్క్ నందు విధులు నిర్వహించు కార్మికుల మస్తరు విధానము పరిశీలించి సకాలంలో హాజరు నమోదు చేయకపోవుట గమనించి విధులలో ఉన్న D. ప్రకాష్ బాబుకి షోకాష్ నోటీసు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కృష్ణవేణి ఘాట్ డ్రెయిన్ ప్రక్కన పడవేసిన సిమెంట్ పోల్స్ తొలగించాలని సూచించారు. ప్రకాశం బ్యారేజి నుండి కెనాల్ రోడ్ నకు వెళ్లు కెనాల్ బ్రిడ్జి పైన రైలింగ్ కు పైయింటింగ్ నిర్వహించాలని మరియు అర్జున్ స్ట్రీట్ దర్గా దగ్గరలో ఉన్న కనకదుర్గ ఫ్లైఓవర్ నాలుగు పిల్లెర్స్ కి పెయింటింగ్ వేయాలి, డివైడర్ నందు ప్లాంటేషన్ నిర్వహించి గ్రీనరి అభివృద్ధి పరచాలని అన్నారు. రధం సెంటర్ నుండి కెనాల్ బండ్ లో వున్నా ఫుట్ పాత్ రిపేర్ చేసి పెయింటింగ్ వేసి ఇరిగేషన్ లాకులు వద్దన ఖాళీ స్థలంలో మొక్కల కుండిలను ఏర్పాటు చేయాలనీ సూచించారు. వినాయక గుడి వెనుక వైపు పరిసరాలు అన్ని శుభ్రపరచాలని, మార్కెట్ జంక్షన్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రక్కన గల యురినల్ పాయింట్స్ మరియు డంపర్ బీన్స్ ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని పరిశీలిస్తూ, ఆయా పరిసరాలు అన్నియు శుభ్ర పరచి అవసరమైన చోట్ల పెయింటింగ్ నిర్వహించాలని సూచించారు. బి,ఆర్,పి రోడ్ నందలి అనధికార ఆక్రమణలు మరియు బోర్డు లను తొలగించాలని మరియు ప్రభుత్వం గోడలపై పెయింటింగ్ నిర్వహించాలని, ఫుట్ పాత్ మరియు గోడలపై పోస్టర్స్ తొలగించి పెయింట్ నిర్వహించి క్యాన్వాయి వెళ్లు ప్రదేశాల అన్నియు సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.

అదే విధంగా నెహ్రు రోడ్, కె.జీ మార్కెట్, లో బ్రిడ్జి, పాత ప్రభుత్వ హాస్పిటల్ రోడ్, బస్ స్టాండ్, యం.జీ రోడ్ లను పరిశీలించి ఆయా ప్రాంతాలలో సెంట్రల్ డివైడర్, గ్రీనరి తదితర అంశాలను పరిశీలిస్తూ పాడైన డివైడర్ రైలింగ్ కు తగిన మరమ్మత్తులు నిర్వహించాలని, వాటికీ పెయింట్ పనులు చేపట్టి ఇంపుగా పెరిగిన మొక్కలను ట్రిమ్మింగ్ చేసి ఆకర్షనీయంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. వీటితో పాటుగా యం.జి రోడ్ నందలి డ్రెయిన్స్ నందు దిసిల్టింగ్ పనులు నిర్వహించిన ప్రాంతములోని కేర్బ్ వాల్స్ కి పెయింటింగ్ నిర్వహించాలని అన్నారు. తడిపరి స్టేడియం ఆవరణలో జరుగుతున్న పనులను పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు ఇస్తూ, స్టేడియం నందు అవసరమైన ప్రాంతాలలో రిపెయింటింగ్ పనులు చేపట్టాలని సూచించారు.

పై పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతాభాయి, సిటి ప్లానర్ జీ.వి.ఎస్.వి ప్రసాద్, ఎస్.ఇ పి.వి.కె భాస్కర్, వి.ఏ.ఎస్ డా.ఎ.రవిచంద్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, హెల్త్ ఆఫీసర్లు మరియు ఇతర అధికారులు క్షేత్ర స్తాయి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *