విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహా నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు.
స్థానిక కలెక్టర్ కార్యాలయం నుండి మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పునకర్, జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్, సబ్ కలెక్టర్ జి ఎస్‌ఎస్ ప్రవీణ్‌చంద్, యంపిడివోలు, తహాశీల్థార్లు, గృహా నిర్మాణ శాఖ అధికారులతో గృహా నిర్మాణ పనుల ప్రగతిపై శనివారం కలెక్టర్ ఎస్ ఢల్లీి రావు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎస్ డిల్లీరావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికి ఇళ్లు పథకంలో భాగంగా జిల్లాలో జరుగుతున్న గృహా నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ అన్నారు. నిర్మాణ పనులు వివిధ దశలలో పూర్తి అయిన వెంటనే బిల్లులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. గృహా నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నిర్మాణాకి అవసరమైన ఇసుక, సిమెంట్, ఐరన్ లబ్దిదారులకు పెండిరగ్ లేకుండా అందుబాటులో ఉంచాలన్నారు. గృహా నిర్మాణాలు చివరి దశకు వచ్చిన చోట సిసిరోడ్లు, డ్రైనేజ్, ఇంటింటి కుళాయి తదితర సౌకర్యాల పై దృష్టి పెట్టాలని కలెక్టర్ ఢల్లీిరావు అధికారులను ఆదేశించారు. జిల్లాలో మున్సిపల్ ఏరియా, అర్భన్ డవలప్మెంట్ ఏరియా, యుఎల్‌బిఎస్ ఏరియాలలో కలిపి 82,430, గృహాలు మంజూరు అయ్యాయని, దీనిలో చేయదగినవి మొత్తం 52,454. చేయలేనివి మొత్తం 29,976 ఉన్నాయని అన్నారు. మున్పిపల్ ఏరియాలో 36,455 మంజూరు కాగా వీటిలో చేయదగినవి 10,847, చేయలేనివి 25,608, అర్భన్‌లోకల్‌బాడిస్ ఏరియాలో 9,388 మంజూరు కాగా వీటిలో చేయదగినవి 8,201, చేయలేనివి 1,187,అర్భన్ డవలప్మెంట్ ఏరియాలో 36,587 మంజూరు కాగా వీటిలో చేయదగినవి 33,406,చేయలేనివి 3,181. వీటిలో అవసరమైన చోట్ల అప్రోచ్ రోడ్లు, ఇంటర్నల్ రోడ్లు, కలవ్ట్స్‌ం పనులు చేయవల్సి వుందన్నారు.
చేయదగినవి` ఆన్‌లైన్ అప్‌లోడ్ చేసినవి:`
జిల్లాలో మున్సిపల్ ఏరియా, నాలుగు యుఎల్‌బిఎస్, 12 అర్భన్ డవలప్మెంట్ అథారిటీ మండలాలు మొత్తం ఆన్‌లైన్ అప్‌లోడ్ చేసినవి 47,282 కాగా వీటిలో చేయదగినవి 52,454, బిబిఎల్ దశలో 16,006 ఉన్నావి, ప్రారంభం కానివి 31,276 ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.
మున్పిపల్ ఏరియాలో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసినవి 19,706 కాగా వీటిలో చేయదగినవి 10,847 ఉండగా బిబిఎల్ దశలో 50 ఉన్నాయని, ప్రారంభం కానివి 19,656 ఉన్నాయని అన్నారు.
నాలుగు యుఎల్‌బిఎస్ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసినవి 4,633 కాగా వీటిలో చేయదగినవి 8,201 ఉండగా బిబిఎల్ దశలో 1,891 ఉన్నాయని, ప్రారంభం కానివి 2,742 ఉన్నాయని అన్నారు.
అర్భన్ డవలప్మెంట్ అథారిటీ మండలాలో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసినవి 22,943 కాగా వీటిలో చేయదగినవి 33,406 ఉండగా బిబిఎల్ దశలో 14,065 ఉన్నాయని, ప్రారంభం కానివి 8,878 ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.