Breaking News

ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దోమల వ్యాప్తిని అరికట్టి మలేరియా, డెంగ్యూ వంటి విష జ్వరాల నుండి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ యస్. ఢిల్లీ రావు అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ లో శనివారం దోమలు వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మలేరియా కంట్రోలింగ్ అధికారులు, జలవనరులు, జిల్లా, నగరపాలక సంస్థ వైద్య ఆరోగ్య శాఖ, శానిటేషన్ అధికారులతో జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీ రావు సమన్వయ సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ముఖ్యంగా నగరపాలక సంస్థ పరిధిలో దోమలు వ్యాప్తి చెందకుండా అరికట్టేందుకు అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. వీటిలో భాగంగా యాంటీ లార్వా ఆపరేషన్, నీటి నిల్వలు లేకుండా చూడటం, ఆయిల్ బాల్స్ వెదజల్లడం, ఫాగింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చునని ఇందుకు జిల్లా మలేరియా కంట్రోలింగ్ అధికారులు వైద్య ఆరోగ్య శాఖ, శానిటేషన్ సిబ్బంది సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.
నగరంలోని ప్రధాన కాలువలైన ఏలూరు, బందరు, రైవస్ కాలువలలో ప్రస్తుతం నీటి ప్రవాహం ఉన్నందున దోమల వ్యాప్తి అంతగా ఉండదని జలవనరుల శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ కు వివరించారు. అయితే కాలువలు మూసివేసిన అనంతరం గుర్రపు డెక్క, తూడు, చెత్త పేరుకొని లార్వా వృద్ధి చెందే ప్రమాదం ఉన్నందున ముందస్తు దశలోనే యాంటీ లార్వా ప్రక్రియ చేపట్టినట్ల అయితే దోమల వృద్ధిని అరికట్టవచ్చునని అన్నారు. ఇందుకు జలవనరుల శాఖ అధికారులు కాలవులలో ఎక్కడా గుర్రపు డెక్క చెత్తను ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు.క్యాచ్ మెంట్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (CADA) ఆధ్వర్యంలో ఆపరేషన్ అండ్ మెయింటినెన్స్ పనుల్లో భాగంగా నగరంలోని ప్రధాన కాలువలైన బుడమేరు,బందరు, ఏలూరు, రైవస్ కాలువలలో గుర్రపుడెక్క, తూడు తొలిగింపు పనులకు మే నెల రెండో వారంలో టెండర్లను పిలిచి మూడవ వారంలో పనులను చేపడతామని జలవనరుల శాఖ అధికారులు కలెక్టర్ కు వివరించారు. వేసవికాలంలో కాలువలో నీటి ప్రవాహం ఉండకపోవడంతో మురుగు నీరు చేరి తద్వారా దోమలు వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున ప్రాథమిక దశ అయిన లార్వా దశలోనే వాటి నిర్మూలించేందుకు అన్ని రకాల నివారణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అన్ని రకాల దోమలు ప్రమాదకరమైనవి కావని దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. దోమలు వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా షార్ట్ ఫిలిం రూపొందించి ప్రచారం నిర్వహించాలని కలెక్టర్ ఢిల్లీ రావు నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పునకర్, విఎంసి చీఫ్ ఇంజనీర్ ప్రభాకర్ రావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఎన్ సుహాసిని, వి ఎం సి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. జి గీత బాయ్, కెసిడివిజన్ ఇఇ, ఏ రాజా స్వరూప్ కుమార్ తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *