Breaking News

సంక్షేమ పథకాలపై గోబెల్స్ ప్రచారం సిగ్గుచేటు

-పేదరిక నిర్మూలనకు సంక్షేమ పథకాలు అమలు చేస్తే.. రాష్ట్రం శ్రీలంక అవుతుందా..?
-సుందర హరిత విజయవాడ కార్యక్రమంలో ప్రతిపక్షంపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేదలకు సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందనడం ప్రతిపక్ష నేతల అవివేకానికి నిదర్శనమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. పరిశుభ్రత వారోత్సవాలలో భాగంగా 33వ డివిజన్ సత్యనారాయణపురంలో నిర్వహించిన ‘సుందర హరిత విజయవాడ’ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తితో కలిసి ఆయన పాల్గొన్నారు. తొలుత నగర సుందరీకరణలో భాగంగా వీఎంసీ సిబ్బందితో కలిసి పాడైన గోడలకు రంగులు వేశారు. అనంతరం వారోత్సవాలపై ఇంటింటికీ అవగాహన కల్పిస్తూ.. జీ.ఎస్.రాజు వీధి, రామమందిరం వీధి, తాడంకి వారి వీధి, మేనేజర్ సుబ్బారావు వారి వీధి, ముదిగొండ వారి వీధి, గిరి వీధులలో ర్యాలీ నిర్వహించారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ పడవేయడం వల్ల చుట్టుపక్కల గోడలన్నీ పాడవుతాయని.. కనుక నిర్దేశించిన ప్రాంతాలలో మాత్రమే పడవేయాలని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. పాడైన గోడలన్నింటికీ సుందర హరిత విజయవాడ కార్యక్రమంలో భాగంగా రంగులు వేయడం జరుగుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేలా.. గోడలపై స్లోగన్స్, సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. త్రాగునీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుంటే వ్యాధులు దరిచేరవని గృహ యజమానులకు వివరించారు. ప్రతిఒక్కరూ పరిసరాల పరిశుభ్రతపై పూర్తి అవగాహన పెంచుకుని ఆరోగ్యవంతమైన జీవనం గడపాలని కోరారు. అలాగే గృహ నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అందించే సాయంపై లబ్ధిదారులకు విస్తృత అవగాహన కల్పించేలా సమావేశాలు నిర్వహించాలని సచివాలయ సిబ్బందికి సూచించారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలలో సంతృప్తిస్థాయి చాలా వరకు పెరిగిందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. డివిజన్ పర్యటనలలో ఎక్కడా కూడా సంక్షేమ కార్యక్రమాలపై ఫిర్యాదులు అందకపోవడం పట్ల వాలంటీర్లను ప్రత్యేకంగా అభినందించారు. సున్నా వడ్డీ పథకం మూడో విడతకు సంబంధించి సెంట్రల్ నియోజకవర్గంలో 4,437 గ్రూపులకు గానూ రూ. 6.55 కోట్ల నగదు అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాలలో జమ అయినట్లు వెల్లడించారు. మహిళలందరూ తమ ఆనందాన్ని పంచుకునేలా సున్నా వడ్డీ వారోత్సవాలను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. జగనన్న సంక్షేమ పాలనకు ప్రజలందరూ బ్రహ్మరథం పడుతుంటే.. టీడీపీ మాత్రం ద్వంద్వ వైఖరిని అవలంభిస్తోందని మల్లాది విష్ణు విమర్శించారు. ఓసారి సంక్షేమ పథకాలకు డబ్బులు ఇవ్వడం తప్పని వ్యాఖ్యానిస్తూనే.. మరోవైపు ఇవన్నీ తమ ఆలోచన నుంచి వచ్చిన పథకాలంటూ రెండు నాలుకలతో మాట్లాడుతున్నారన్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో జరిగినది అందరూ బాధపడాల్సిన దురదృష్టకర సంఘటన అని మల్లాది విష్ణు అన్నారు. సమాచారం తెలిసిన వెంటనే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించి, అన్ని శాఖలను ఆదేశించారని తెలిపారు. నిందితులను అరెస్ట్ చేయడం, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను సస్పెండ్ చేయడం వేగంగా జరిగిపోయాయని అన్నారు. అదే గత ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు జరిగినపుడు ఇంత వేగంగా చర్యలు తీసుకోలేదని గుర్తుచేశారు. ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా ఉక్కుపాదంతో అణచివేస్తామని.. నగరంలో నేరగాళ్లకు చోటులేదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస్, జోనల్ కమిషనర్ రాజు, డీఈ గురునాథం, అసిస్టెంట్ మెడికల్(హెల్త్) ఆఫీసర్ రామకోటేశ్వరరావు, నాయకులు మాదాసు గోపాల్, మైలవరపు రామకృష్ణ, శనగవరపు శ్రీను, సనత్, కమ్మిలి రత్న, కొండా, మల్లిక్, కొల్లూరు రామకృష్ణ, భాగ్యారావు, కూనపులి ఫణి, వై.సుధీర్ బాబు, మంగళంపల్లి చంటి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *