Breaking News

విద్యార్థిని విద్యార్థులకు శారీరక దృడత్వం, మానసిక ఉల్లాసానికి క్రీడలు అవసరం…

-రాష్ట్రా వ్యాప్తంగా 48 క్రీడాంశాల్లో 1670 వేసవి క్రీడాశిక్షణా కేంద్రాల నిర్వహణ…
-విద్యార్థులో ఉన్న క్రీడా స్పూర్తిని వెలిక తీసేందుకు గ్రామీణ స్థాయిలో పోటీల నిర్వహణ…
-అంతర్జాతీయ క్రీడల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యం…
-యువజన వ్యవహారాలు, పర్యటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామీణ స్థాయి నుండి విద్యార్థుల్లో ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి వారిని ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, విద్యార్థులలో శారీరక దృడత్వంతో పాటు మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం చేస్తాయని వాటి పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు 48 క్రీడాంశాలలో 1670 వేసవి క్రీడాశిక్షణా కేంద్రాల ద్వారా శిక్షణ అందిస్తున్నట్లు యువజన వ్యవహారాలు పర్యటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు.
స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (శాప్‌) ఆధ్వర్యంలో స్థానిక ఇంధిరాగాంథీ మున్సిపల్‌ స్టేడియంలో విద్యార్థిని, విద్యార్థులకు పలు క్రీడా అంశాలపై నిర్వహిస్తున్న వేసవి శిక్షణా శిభిరాన్ని బుధవారం మంత్రి ఆర్కే రోజా జ్వోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతో మంది ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నారన్నారు. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలనే ఉద్ధేశంతో గ్రామీణ స్థాయిలో విద్యార్థిని విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కరోనా మహమ్మారి కారణంగా గత రెండు సంవత్సరాలుగా విద్యార్థిని విద్యార్థులు కేవలం గృహాలకే పరిమితమై ల్యాప్‌టాప్‌, సెల్‌ఫోన్‌లతో కాలక్షేపం చేస్తూ శారీరక దృడత్వం లేక అనేక రుగ్మతులకు గురి అయ్యారన్నారు. అందుకే ప్రభుత్వం రూ.83.50 లక్షల ఖర్చుతో 1670 శిక్షణాశిభిరాలను నిర్వహించి 48 క్రీడాంశాలలో విద్యార్థిని విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులను శిభిరాలకు పంపి క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకునేలా కృషి చేయాలన్నారు. అంతర్జాతీయ క్రీడా పోటీల్లో రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహించి వివిధ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడా విజేతలకు 41.71 కోట్ల రూపాయలు ప్రోత్సహాక బహుమతిగా అందజేయడం జరుగుతుందన్నారు. వైఎస్సార్‌ క్రీడా ప్రోత్సహం ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,462 మంది అథ్లటిక్‌ క్రీడా కారులకు 55 క్రీడా విభాగాల్లో 4.50 కోట్ల రూపాయాల క్రీడా ప్రోత్సహం కింద అందించడం జరిగిందన్నారు. అంతర్జాతీయ బ్యాట్‌మెంటన్‌ క్రీడా కారులు పివి సింధు, సాత్విక్‌ సాయి రాజ్‌, హాకీ క్రీడా కారిని రజనీ, ఆర్ఛరీ క్రీడా కారిని జ్వోతి సురేఖలను రాష్ట్రానికి వారి తీసుకువచ్చిన గుర్తింపుకుగాను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సముచితరీతిన వారిని సత్కరించి ప్రోత్సహాక బహుమతులను అందించిన విషయాలను గుర్తు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడా కారులకు ఉద్యోగ అవకాశాలను కల్పించడమే కాకుండా స్పోర్స్ట్‌ కోటాలో ఇప్పటివరకు దాదాపు 2000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు.
జిల్లాలో అన్యాక్రాంతానికి గురి అయిన క్రీడా మైదానాలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని క్రీడా ప్రాగణంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్‌కు లేఖ రాయడం జరిగిందని మంత్రి తెలిపారు. ఎడ్వంచర్‌ స్పోర్ట్స్‌, వాటర్‌ స్పోర్ట్స్‌ను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సియం కప్‌ ఆటల పోటీలను ఇక పై మండల స్థాయిలో కూడా నిర్వహించాలనే ఆలోచన చేస్తున్నామన్నారు. గిరిజన సంక్షేమ, సాంఫీుక సంక్షేమ వసతి గృహాల విద్యార్థిని విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వారు క్రీడల్లో మరింత రాణించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి రోజా తెలిపారు.
జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా కోవిడ్‌ కారణంగా నిత్తేజంగా వున్న విద్యార్థిని విద్యార్థులలో మానసిక ఉల్లసాన్ని పెంపొందించడంతో పాటు క్రీడల పట్ల ఆసక్తి కల్పించే విధంగా వేసవి శిక్షణాశిభిరాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. జిల్లాలోని జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ మున్సిపల్‌ పాఠశాలలో ఈనెల 31వ తేది వరకు 25 క్రీడాంశాలలో 85 శిక్షణాశిభిరాలను నిర్వహించి విద్యార్థిని విద్యార్థులకు క్రీడలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం పలు క్రీడా అంశాలను మంత్రి ప్రారంభించారు. విద్యార్థిని విద్యార్థులతో ఇందిరాగాంథీ స్టేడియం నుంచి డివిమెనార్‌ హోటల్‌ వరకు నిర్వహించిన రాలీని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు, స్థానిక శాసనసభ్యులు మల్లాది విష్ణువర్థన్‌ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు మల్లాది విష్ణువర్థన్‌, నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, యువజన వ్యవహారాల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరి జి. వాణి మోహన్‌, శాప్‌ యండి ఎన్‌. ప్రభాకర్‌రెడ్డి, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కమీషనర్‌ జె. సురేష్‌ కుమార్‌, మున్సిపల్‌ కమీషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పునకర్‌, డిప్యూటి మేయర్లు అవుతు శైలజా రెడ్డి, బెల్లం దుర్గ, కార్పొరేట్‌ కె. అనిత, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కోడి పందాలు నిర్వ‌హిస్తే క‌ఠిన చ‌ర్య‌లు

– పందెంలో పాల్గొన్నా చ‌ట్టరీత్యా నేరమే – నిబంధ‌న‌ల అమలు చేసేందుకు గ్రామ‌, మండ‌ల‌, డివిజ‌న్ స్థాయిలో ప్ర‌త్యేక బృందాలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *