-కోనసీమ జిల్లాకు డా.అంబేద్కర్ పేరు పెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు
-కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రి రాందాస్ అథవాలే
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దళిత వర్గాలకు సామాజిక న్యాయం అందించి సాధికారత సాధించేలా కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రి రాందాస్ అథవాలే అన్నారు. రాష్ట్రంలో పర్యటించేందుకు మంగళవారం ఎన్‌టిఆర్ జిల్లాకు విచ్చేసిన కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రి రాందాస్ అథవాలే విజయవాడలోని హోటల్ వివంతలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే మాట్లాడుతూ రాష్ట్ర జనాభ 5 కోట్లు ఉండగా అందులో 84.69 లక్షల మంది షేడ్యూల్ కులాలకు చెందిన వారు ఉన్నారన్నారు. అణగారిన వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో విద్యార్థిని విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, ఫ్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 3,35,358 మంది విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కింద 413.12 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్య దీవెన జగనన్న వసతి దీవెన పథకాల ద్వారా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఫీజు రాయితీతో పాటు స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నట్లు తెలిపారు. 2021`22 ఆర్థిక సంవత్సరానికి 2,13,694 ఎస్సీ విద్యార్థులకు 82.04 కోట్ల రూపాయలను ఫ్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కింద విడుదల చేసిన్నట్లు ఆయన తెలిపారు. ఎస్సీ ఎస్టీ వర్గాలపై జరుగుతున్న దాడులను ఆరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 2019 సంవత్సరంలో 2739 కేసులు, 2020లో 2432 కేసులు, 2021లో 2757 కేసులు నమోదు కాగా ఈ ఏడాది ఇప్పటివరకు 1290 కేసులను నమోదు చేసిన్నట్లు తెలిపారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను వీలైనంత త్వరలో పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులను దృష్టికి తీసుకువచ్చామన్నారు. ఇప్పటి వరకు నమోదు అయిన కేసులలో దాదాపు 50 శాతం పైగా చార్జీ షీట్లను నమోదు చేయడం జరిగిందన్నారు. ఇతర వర్గాల వారు ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వారిని వివాహాం చేసుకుంటే కులంతర వివాహాం పథకం ద్వారా అందించే నగదు పోత్సహాన్ని 75 వేల నుంచి లక్ష 20 వేలకు పెంచిన్నట్లు ఆయన తెలిపారు. ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజల విద్య సామాజిక ఆర్థికాభివృద్ధికి గత నాలుగు సంవత్సరాలలో వివిధ పథకాల ద్వారా సుమారు రూ.66,658 కోట్లను కేటాయించగా ఇప్పటికవరకు 43,238 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీఎస్టీ వర్గాల ప్రయోజనాలను కాపాడేందుకు చేస్తున్న కృషి అభినందనీయ మన్నారు. ప్రధానమంత్రి నంరేంద్రమోదీ దళిత వర్గాలకు సముచిత స్థానం ఇవ్వాలనే సంకల్పంతో ఇంతకముందు ఎస్సీ వర్గానికి చెందిన రాంనాద్ కోవింద్‌ను రాష్ట్రపతిని చేశారని ఈ సారి ఎస్టీ వర్గానికి చెందిన మహిళను రాష్ట్రపతిని చేయనున్నారన్నారు. రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు రాష్ట్రానికి చెందిన పాలక పక్షం విపక్షం మద్దతు పలకడం హర్షనీయమన్నారు. కోనసీమ జిల్లాకు దళిత వర్గానికి చెందిన రాజ్యంగ నిర్మాత రాజనీతజ్ఞ్నడు డా. బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును పెట్టడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతను తెలియజేస్తున్నట్లు కేంద్రమంత్రి రాందాస్ అథవాలే తెలిపారు. సమావేశంలో రాష్ట్ర సాంఫీుక సంక్షేమ శాఖ సెక్రటరీ యం.యం. నాయక్, డైరెక్టర్ హర్షవర్థన్, వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ రవిప్రకాష్‌రెడ్డి, ఏడి రఘురాం, బిసి సంక్షేమ శాఖ ఆర్‌డి జి.వి రఘరామ్, సిఐడి ఎస్పీ వి రత్న, రిపబ్లిక్ పార్టీ నాయకులు బి.అనిల్, బ్రహ్మనందరెడ్డి, శివనాగేశ్వరరావు, తదితరులుపాల్గొన్నారు.