-10.694మంది అభ్యర్థులకు గాను.. 4,760 మంది హాజరు.
-44.51%గా నమోదు..
-జాయింట్ కలెక్టర్ నూపూర్ అజయ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీపీఎస్సీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్- 2 (ఎండోమెంట్) ఉద్యోగ నియామక పరీక్షలకు ఆదివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్లు జాయింట్ కలెక్టర్ నూపూర్ అజయ్ అన్నారు. నగరంలోని పడమట ఎస్ ఆర్ ఆర్ సి వి ఆర్ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాన్ని ఆదివారం జాయింట్ కలెక్టర్ నూపూర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరీక్ష నిర్వహణకు ఏర్పాటుచేసిన 19 కేంద్రాల్లో 10,694మంది అభ్యర్థులకు గాను 4,760మంది అభ్యర్థులు హాజరయ్యారు అన్నారు. పరీక్షా కేంద్రాలలో అధికారులు చేసిన ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ నూపుర్ అజయ్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.