నేటి పత్రిక ప్రజావార్త :
కిలో ఉల్లి రూ.100కు పెరిగితేనే గుండె ఆగినంత పనైంది. అలాంటిది.. ఈ రైతు పండిస్తున్న ఈ కూరగాయ కిలో లక్ష పలుకుతోందంటే మీరు నమ్మగలరా. బీహార్‌లోని కరండిహ్ గ్రామానికి చెందిన అమరేష్ సింగ్ అనే 38 ఏళ్ల రైతు కూడా వ్యవసాయాన్ని సరికొత్త మార్గంలో నడిపిస్తున్నాడు. ఎంతో విలువైన కూరగాయను తన పొలంలో పండిస్తూ.. లాభాలు ఆర్జిస్తున్నాడు. రూ.2.5 లక్షల పెట్టుబడితో ఔరంగబాద్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో ‘హాప్-షూట్స్’ అనే అరుదైన కూరగాయను పండిస్తున్నారు.
ఎందుకంత గిరాకీ?
‘హాప్-షూట్స్’ సాదాసీదా పంట కాదు. ఇది శరీరంలో క్షయ(టీబీ)తో పోరాడే యాంటీబాడీస్ సృష్టిస్తుంది. ఇందులోని ఆమ్లాలు క్యాన్సర్ కణాలను చంపేస్తాయి. లుకేమియా కణాలను బ్లాక్ చేస్తాయి. అయితే, ఇలాంటి పంటను ఇండియాకు తీసుకొచ్చింది సింగ్ కాదు. ఇదివరకు హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్‌లో పండించారు. దీనిపై అవగాహన లేకపోవడం, మార్కెటింగ్ చేసేవారు లేకపోవడంతో పండించడం ఆపేశారు. అయితే, ప్రజలకు ఈసారి ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన నేపథ్యంలో తప్పకుండా దీనికి మంచి రాబడి వస్తుందని అమరేష్ సింగ్ ఆశిస్తున్నాడు. ఐఏఎస్ అధికారిని సుప్రీయా సాహు తాజాగా దీని గురించి ట్వీట్ చేశారు. ఇది భారత రైతుల జీవితాలను మారుస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు.