-నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలలో క్షేత్ర స్థాయిలో సమస్యల పరిశీలన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు ఎదురౌతున్న ప్రధాన సమస్యలను శనివారం జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, ఐ.ఏ.ఎస్, శాసన సభ్యులు వెల్లంపలి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, అధికారులతో కలసి క్షేత్ర స్థాయిలో కుమ్మరి పాలెం సెంటర్, బ్యాంక్ స్ట్రీట్, కోళ్ళ ఫారం రోడ్, ఫ్లోర్ మ్యాన్ బంగ్లా, రాజరాజేశ్వర పేట రైల్వే స్థలములలోని నివాసాలను పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేసారు. నియోజకవర్గన్ని అభివృద్ధి పరచుటలో భాగంగా అధికారుల సమన్వయంతో ప్రజలకు ఎదురౌతున్న ప్రధాన సమస్యలు లేదా ఇబ్బందులను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవటం జరుగుతుందని దానిలో భాగంగా నేటి ఈ పర్యటన ద్వారా కుమ్మరిపాలెం సెంటర్, కోళ్ళ ఫారం రోడ్ తదితర ప్రాంతాలలో ఇళ్ళ రెగ్యూలైజేషన్, పట్టాల సమస్య, పున్నమి ఘాట్ ఎలక్ట్రికల్ క్రిమిటోరియం వద్ద కర్మల భవన నిర్మాణం కొరకు స్థల పరిశీలన, ఎర్రకట్ట దిగువ ఫ్లోర్ మ్యాన్ బంగ్లా వద్ద వాహనముల రాకపోకల సాగించుటకు వీలుగా రిటైనింగ్ వాల్ నిర్మాణము, రాజరాజేశ్వర పేట నందలి రైల్వే స్థలములో ఇళ్ళ సమస్య వంటి పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురావటం జరిగింది. నగరాభివృధికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యేక శ్రద్ధ వహించి నిధులు కేటాయించుట జరుగుతుందని, సత్వరమే సమస్యల పరిష్కరాన్నికి చర్యలు తీసుకుంటామని శాసన సభ్యులు పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని, అదే విధంగా ఫ్లోర్ మ్యాన్ బంగ్లా వద్ద గల సమస్యను పరిష్కరించుటకై త్వరలో ఆర్ అండ్ బి మరియు రైల్వే అధికారులతో కలసి కో-ఆర్డినేషన్ సమావేశం నిర్వహించుకొని రిటైనింగ్ వాల్ పటిష్ట పరచుటకు తగిన నిధులు ప్రభుత్వ ద్వారా సమకూర్చుకొని సత్వరమే సమస్యను పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, అదే విధంగా కుమ్మరి పాలెం నందలి రెవిన్యూ స్థలముల సమస్య, ఇళ్ళ పట్టాల సమస్యలను కూడా అతి త్వరలో పరిష్కార చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
తదుపరి శాసన సభ్యులు, మేయర్ మరియు కమిషనర్ అధికారులతో కలసి మిల్క్ ప్రాజెక్ట్ సి.వి.ఆర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి దిగువన బుడమేరులో కలియు మేజర్ అవుట్ ఫాల్ డ్రెయిన్ మరియు విద్యాధరాపురం స్టేడియం స్థలములను పరిశీలించిన సందర్బంలో డ్రెయిన్ నందలి వ్యర్దాములను తొలగించాలని, చెత్త మరియు వ్యర్ధముల నేరుగా డ్రెయిన్ లోకి వెళ్ళకుండా ఐరన్ గ్రేట్టింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అదే విధంగా విద్యాధరాపురం స్టేడియం గ్రౌండ్ అంతయు చదును చేసి అడుగు ఎత్తున గ్రావెల్ ఫిల్లింగ్ చేయుటకు తగిన ప్రణాళికలను సిద్దం చేసి పనులు చేపట్టునట్లుగా చూడాలని అధికారులకు సూచించారు. ఈ సందర్బంలో నియోజకవర్గ పరిధిలో అసంపూర్తిగా ఉన్న ఎల్ అండ్ టి డ్రెయిన్ నిర్మాణ పనులు కూడా సత్వరమే చేపట్టి పూర్తి చేయునట్లుగా చూడాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. అదే విధంగా మేయర్ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో ప్రజలు ఎదుర్కోను ఇబ్బందులు అన్నియు సత్వరమే పరిష్కరించునట్లుగా చర్యలు తీసుకోవటం జరుగునని, 38వ డివిజన్ నందలి ఎలక్ట్రికల్ క్రిమిటోరియం త్వరలో అందుబాటులోకి తిసుకువటంతో పాటుగా అక్కడ ఒక కర్మల భవనం నిర్మించుటకు కూడా స్థల పరిశీలన చేయుట జరిగిందని వివరించారు.
ప్లాస్టిక్ నిషేధం పై ప్రజలకు అవగాహన:
భవానిపురం కోళ్ళ ఫారం రోడ్ నందు ప్రజలకు సింగల్ యూజ్ ప్లాస్టిక్ నివారణపై అవగాహన కార్యక్రమము నిర్వహించి ప్రజలు ప్లాస్టిక్ కు బదులుగా గతంలో మనం వినియోగించిన మాదిరిగా క్లాత్ సంచులను వినియోగించుకోవాలని పిలుపునిస్తూ, స్థానికులకు క్లాత్ సంచులను పంపిణి చేసారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల వాతావరణం కలుషితం అగుటయే కాకుండా పారిశుధ్య నిర్వహణకు కూడా తీవ్ర అవరోధం కలిస్తున్నదని, ప్లాస్టిక్ సంచుల ద్వారా చెత్త మరియు వ్యర్దాములను డ్రెయిన్ లలో పడవేయట ద్వారా మురుగునీటి పారుదల మరియు యు.జీ.డి వ్యవస్థకు ఇబ్బందులు ఎదురౌతుందని, ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ కు బదులుగా ప్రత్యామ్నాయ జ్యూట్, పేపర్ లేదా క్లాత్ సంచులు మాత్రేమే వాడుకోవాలని పిలుపునిచ్చారు. పర్యటనలో పలువురు కార్పొరేటర్లు, అధికారులు మరియు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.