విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, ఆర్థిక కార్యకలాపాలకు నాబార్డ్ ద్వారా అందిస్తున్న ఆర్థికపరమైన సేవలను సద్వినియోగం చేసుకోవాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎన్ సాయిరాం అన్నారు. అజాదీకా అమృత్ మహోత్సవాలలో భాగంగా ఎన్‌టిఆర్ కృష్ణా జిల్లాలలోని స్వచ్ఛంద సంస్థల పత్రినిధులు రైతుల ఉత్పత్తి దారులు సంఘ సభ్యులకు విజయవాడ రూరల్ కొత్తూరు తాడేపల్లిలో నేస్థం ట్రైనింగ్ సెంటర్‌లో ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హజరైన లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎన్ సాయిరాం మాట్లాడుతూ నాబార్డ్ సంస్థ ద్వారా 250 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయాన్ని రైతుల ఉత్పత్తి దారుల సంఘాలకు అందించి వారి వ్యాపారాన్ని నిర్వహించుకునేందుకు సహాయం చేయడం పట్ల అభినందించారు. 40 సంవత్సరాలుగా నాబార్డ్ గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ అభివృద్దికి తొడ్పాటు అందిస్తుందన్నారు. నాబార్డ్ సంస్థ గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ ఇతర ఆర్థిక కార్యకలాపాలకు రుణాలను అందించి వారు ఆర్థికంగా బలోపేతం అయ్యేలా సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. కార్యక్రమంలో నాబార్డ్ ఎజియం మిలింద్ చౌసాల్కర్ మాట్లాడుతూ నాబార్డ్ గ్రామీణ ప్రాంతాలలో రైతులకు, వ్యవసాయ ఇతర ఆర్థిక కార్యకలాపాలకు రుణాలను అందించి ఆర్థిక పరిపుష్టి సాధించేలా సాయపడుతుందన్నారు.
Tags vijayawada
Check Also
అక్రమ మైనింగ్ కు వినియోగిస్తున్న మూడు పొక్లెయిన్ లు సీజ్
-19 మంది అధికారులు, సిబ్బంది సమక్షంలో దాడులు -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కడియం, నేటి పత్రిక ప్రజావార్త : …