విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ రంగాలలో అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కలిగి సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. అజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఇందన మంత్రిత్వ శాఖ, రాష్ట్ర విద్యుత్ శాఖ విభాగాలు సంముక్తంగా బిజిలీ మహోత్సవాన్ని శనివారం నగరంలోని కలెక్టర్ కార్యాలయంలోని వీడియోకాన్ఫరెన్స్ హాల్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉజ్వల భారత్ ఉజ్వల భవిష్య వేడుకలు ఏ2047 నినాదంతో నిర్వహించిన మహోత్సవాలకు జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్ ముఖ్య అతిధిలుగా హాజరై జ్వోతిప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా అన్ని రంగాలలోను సాధించిన విజయాలు భవిష్యత్‌కు అవసరమైన ముందస్తు ప్రణాళిక తదితర కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. విద్యుత్ రంగంలో దేశం సాధించిన విజయాలను ప్రగతిని మననం చేసుకొని, 2047 నాటికి వందేళ్ల కాలంలో సాధించాల్సిన లక్ష్యాల పై ఉజ్జ్వల భారత్ ఉజ్జ్వల భవిష్యత్ కార్యక్రమాలను నిర్వహించు కుంటున్నామన్నారు. అన్ని రంగాలకు విద్యుత్ అవసరమని విద్యుత్‌తోనే అభివృద్ధి సాధ్యపడు తుందన్నారు.మన రాష్ట్రంలో రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ అందించడం జరుగుతుందన్నారు. 2047 సంవత్సరం నాటికి విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత వినియోగం భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కార్యచరణ ప్రణాళికగా రూపొందించడం బిజిలీ మహోత్సవంలో ప్రధాన అంశమని కలెక్టర్ అన్నారు. ప్రపంచ దేశాలతో పోటీపడే విధంగా విద్యుత్ రంగంలో మన దేశం మంచి ఫలితాలు సాధిస్తుందన్నారు. గతంలో ఉండే విద్యుత్ కోతల నుండి నేడు డిమాండ్‌ను మించి మిగులు విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుంటున్నామన్నారు. మన అవసరాలకు వినియోగించుకుని మిగులు విద్యుత్తును ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని కలెక్టర్ అన్నారు.
శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలోను అభివృద్ధి సాధిస్తూ ప్రధమ స్థానంలో ఉందన్నారు. రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న విద్యుత్ సబ్బిడీ కీలకపాత్ర పోహిస్తుందన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోను రైతులకు 9 గంటలు ఉచిత విద్యుత్ అమలు జరగడం లేదని అన్నారు. వ్యవసాయ రంగం కీలకమైనదిగా భావించి ఎక్కువ మంది ప్రజలు ఈ రంగంపై ఆధారపడుతున్నారని గతంలో గుర్తించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2004 సంవత్సరంలోనే ఉచిత విద్యుత్‌ను అమలు చేశారని నేటి మన ముఖ్యమంత్రి వ్రైఎస్ జగన్మోహన్రెడ్డి ఉచిత విద్యుత్‌ను అమలు చేస్తున్నామని శాసనసభ్యులు అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాలలోని ఐదు జిల్లాలో లబ్దిదారులతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ముఖముఖి నిర్వహించి విద్యుత్ రంగంలో తమ అనుభావాలను ప్రధానమంత్రికి వివరించారు.
అనంతరం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రేవంపడ్ డిస్టిబ్యూషన్ సెక్టార్ స్కీమ్, నేషనల్ సోలార్ రూఫ్‌టాప్ పోర్టల్,ఎన్టిపిసి ఆధ్వర్యంలోని గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల శంకుస్థాపన రిమోట్ బటన్ ద్వారా ప్రారంభించారు. కార్యక్రమంలో తొలుత నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆలరించాయి.
కార్యక్రమంలో ఏపిసిపిడిసిఎల్ సియండి జె. పద్మజనార్థన్‌రెడ్డి, ఛీప్ ప్రోగ్రామ్ మేనేజర్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ ఎస్ జయంతి, ఎస్ఇ యం శివప్రసాద్‌రెడ్డి, ఆర్ఇసి లిమిటెడ్ మేనేజర్ జిల్లా నోడల్ ఆఫీసర్ యం శోభన్ ఆర్ఇసి అధికారి సోని భార్గవ్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News