విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందిస్తున్న రియల్ హీరో సీఎం వైఎస్ జగన్ అని కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి (శేషు) అన్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో వరుసగా మూడో ఏడాది కాపు నేస్తం నిధులను విడుదల చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియాజేస్తు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సభను గ్రాండ్ సక్సెస్ చేసిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు, తెలగ, ఒంటరి, బలిజ సోదరులందరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అడపా శేషు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం జగన్ కాపులకు పెద్ద పీట వేశారని.. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం జగన్ కాపు కార్పొరేషన్‌కే ఎక్కువగా నిధులు ఇచ్చారని తెలిపారు. కాపులకు పెద్దన్నలాగా సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలబడ్డారన్నారు. కాపులకు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. కాపునేస్తం పథకం రూపశిల్పి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని తెలిపారు. కాపులకు ఎమ్మెల్యే, ఎంపీ, జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలుగా అవకాశం కల్పించారని… ఒక డిప్యూటీ సీఎం పదవితో పాటు 4 మంత్రి పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా కాపులంతా బలోపేతం కావడానికి సీఎం జగన్ నిబద్దతతో పనిచేస్తున్నారని అడపా శేషు తెలిపారు.
Tags vijayawada
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News