విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జర్నలిస్టుల కుటుంబాలలో ఎవరికి ఏ అవసరమైనా దాని పరిష్కారానికి నేనున్నంటూ ముందుకు వచ్చే ఏకైక వ్యక్తి పుట్టగుంట వెంకట సతీష్ కుమార్ ప్రముఖంగా ఉంటారని ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు అన్నారు. “పుట్టగుంట” హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ లయన్ ఫాస్డ్ గవర్నర్ పుట్టగుంట వెంకట సతీష్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా శనివారం నిరుపేద మహిళ షేక్ ప్యారీ జీవన భృతి నిమిత్తం రూ. 8,000/- లను లయన్స్ క్లబ్ ప్రతినిధుల ద్వారా ఆయన ప్రెస్ క్లబ్ లో ఆర్ధిక సహాయాన్ని అందించారు. ఏపీయూడబ్ల్యూజే నేతల కోరిక మేరకు ఈ ఆర్థిక సహాయాన్ని షేక్ ప్యారీకి అందజేశారు. సేవా తత్పరత, జర్నలిస్టుల సంక్షేమం కోరే ఏకైక వ్యక్తి పుట్టగుంట అన్నారు. కోవిడ్ ప్రబలిన సమయంలో జర్నలిస్టులందరికీ వ్యాక్సిన్ వేయించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోరే ఏకైక వ్యక్తి పుట్టగుంట అన్నారు. ప్రెస్ క్లబ్ వద్ద కడునిరుపేదరికంతో జీవనం గడుపుతున్న విషయాన్ని ఆయన దృష్టికి ఏపీయూడబ్ల్యూజే నేతలు తీసుకు వెళ్లగా వెంటనే స్పందించిన అయిన షేక్ ప్యారీకు ఆర్ధికంగా సహాయాన్ని అందజేసేందుకు సమ్మతించడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ శంకర్ గుప్తా, సెకండ్ వైస్ ప్రెసిడెంట్ గద్దే శేషగిరి, శ్రీనివాసరెడ్డి, దాసరి సుధాకర్, వై రంగారావు, ఏపీయూడబ్ల్యూజే విజయవాడ అర్బన్ అధ్యక్ష కార్యదర్శులు చావా రవి, కొండా రాజేశ్వరరావు, ఎస్కే బాబు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
“ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ ” దరఖాస్తులు స్వీకరణ
-దరఖాస్తు చేసుకున్న వారి జాబితా వెబ్ సైట్ లో అప్లోడ్ చెయ్యడం జరిగింది -ఈనెల 16 వ తేదీ సా …