విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారిని అఖిల భారతీయ అయ్యప్ప ధర్మప్రచార సభ ప్రతినిధులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నవంబర్ 18 నుంచి 21 వరకు జరుగు ‘అయ్యప్ప మహా సంగమం’ మహోత్సవ నిర్వహణకు నగరంలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంను కేటాయించవలసినదిగా అభ్యర్థించారు. ఈ మేరకు ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఆయన నగరపాలక సంస్థ కమిషనర్ తో మాట్లాడి స్థలం కేటాయించే విధంగా చూస్తానని తెలియజేయడంతో కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో నాయకులు చల్లా సుధాకర్, ప్రచార సభ రాష్ట్ర అధ్యక్షులు బెల్లపు హరిప్రసాద్, జాతీయ కార్యదర్శి బాలాంజనేయులు, జాతీయ ఉపాధ్యక్షులు లంకా బాబు, రాష్ట్ర కార్యదర్శి శంకరాచారి, జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ తదితరులు ఉన్నారు.
Tags vijayawada
Check Also
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలు లబ్ధిదారులకు సమర్థవంతంగా చేర్చాలి
-ప్రభుత్వ పథకాలు లక్ష్య సాధన లో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయం అవసరం. -ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి -20 పాయింట్ చైర్ …