విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అజాద్ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమములో భాగంగా పాత బస్ స్టాండ్ వద్ద నిర్వహించిన వాల్ పెయింటింగ్ లను నగర మేయరు రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతూ శ్రీ శైలజారెడ్డి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్బంలో మేయరు భాగ్యలక్ష్మి మాట్లాడుతూ స్వాతంత్యం వచ్చి 75 సంవత్సరాలు అయినందున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అజాద్ కా అమృత్ మహోత్సవ్ నిర్వహించడం జరుగుతుందని దానిలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. దానిలో భాగంగా పాత బస్ స్టాండ్ వద్ద నిర్వహించిన వాల్ పెయింటింగ్ నందు సిద్దార్థ కళాశాల ఆర్ట్స్ కాలేజీ వంటి వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొని ప్రజలలో స్వాతంత్య ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింభించేలా అనేక చిత్రాలు వేయుటతో పాటుగా వాటి యొక్క భావాలును చక్కగా వివరించుట జరిగిందని అన్నారు. ఈ సందర్బంగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి అభినందనలు తెలియజేసారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె. వి. సత్యవతి పాల్గొన్నారు.