ఏళ్ళ తరబడి జైళ్ళలో మగ్గుతున్న అర్హలైన జీవిత ఖైదిలను విడుదల చేయాలి

-భరద్వాజ కన్వీనర్ జీవిత ఖైదీల విడుదల సాధన సమితి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏళ్ల తరబడి జైళ్ళలో మగ్గుతున్న జీవిత ఖైదీలను విడుదల చేయాలని జీవిత ఖైదిల విడుదల సాధన సమితి కన్వీనర్ ఆర్.భరద్వాజ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం గాంధీ నగర్ లో స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవం సందర్బంగా దేశానికి స్వాత్రంత్రం వచ్చి డెబ్భై ఐదేళ్లు పూర్తి అవుతున్న శుభ సందర్బంగా… ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గి పోతున్న జీవిత ఖైదీలను విడుదల చేయాలని కోరారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దయతో నాన్ లైఫర్స్ విడుదల కోసం జీవో విడుదల చేశారని అన్నారు. సాధారణం గా జీవిత ఖైదీల విడుదల కోసం ప్రభుత్వం ఇచ్చే జీవోల్లో ఏడు సంవత్సరాల కఠిన శిక్ష రేమిషన్ తో కలిపి పదేళ్లు పూర్తి చేసిన ఖైదీలు విడుదలకు అర్హులు అని చెప్తు మార్గదర్శకాలు విడుదల చేస్తూ ఉంటారని తెలిపారు. అయితే మేం కోరేదేమంటే ఆజాది అమృత మహోత్సవం లాంటి సందర్బం ఎప్పుడు అంటే అప్పుడు రాదు కనుక ఈ ప్రత్యేక సందర్భానికి ఉన్న విశీష్టత గుర్తిస్తూ… పెద్ద పెద్ద నేరాల్లో శిక్ష అనుభవిస్తున్న నేరస్తులను… వారి నేరాల తీవ్రతను బట్టి శిక్షా కాలం పెంపు చేయవచ్చని ఉదాహరణకు చిలకలూరిపేట బస్సు దహనం కేసులో శిక్ష అనుభవిస్తున్న చలపతి విజయవర్ధన్ లను విడుదల చేయడానికి ఈ రిమేషన్ తో కలిపి పదేళ్లు అనే నిబంధన బదులు ఇరవై ఏళ్ళు విత్ రేమిషన్ పూర్తి చేసిన అని నిబంధన పెట్టి విడుదల చేస్తే బావుంటుంది అనేది మా అభిప్రాయమన్నారు. ఇలాగే నేరం తీవ్రత బట్టీ విడుదలకు ప్రమాణంగా నిర్ణయించే.. శిక్ష కాలాన్ని పెంచుతూ వెళ్లి ఆ మేరకు వాళ్ళు శిక్ష కాలం పూర్తి చేసి ఉంటే విడుదల చేస్తే అజాది అమృత మహోత్సవం కార్యక్రమానికి అర్థం చేకూరుతుందని విన్నపం చేసుకుంటున్నాని తెలిపారు. ఇదే విషయమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, సుప్రీం కోర్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు పిటిషన్ పెడుతున్నామన్నారు. వివిధ పౌర ప్రజాస్వామిక సంఘాలతో కలసి… రాష్ట్రం లో వివిధ వర్గాల ప్రజల సంతకాల సేకరణ కార్యక్రమం కూడా చేబడుతున్నామని తెలిపారు. నానక్ రామ్ గూడ… రామానాయుడు స్టూడియో దగ్గర పరిటాల రవి టార్గెట్ గా మద్దెల చెరువు సూరి ఏర్పాటు చేసిన మందుపాతర లో 28 మంది మీడియా వారు మృతులయ్యారని ఆ కేసు లో అరెస్ట్ అయిన వారు ఏడు సంవత్సరాల శిక్ష చేసి విడుదల అయ్యారు. కాబట్టి ప్రభుత్వం సీరియస్ గా పట్టించుకుని రిపబ్లిక్ డే కైనా జీవిత ఖైదీల విడుదల కు జీవో ఇవ్వాలి అని విజ్ఞప్తి చేస్తున్నామని కోరారు. ఈ కా‌ర్యక్రమంలో కోస్తాంద్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సర్వేపల్లి సుధర్శన్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పోషన్ ప్లస్ కార్యక్రమం ద్వారా అవగాహాన కల్పించడం ముఖ్య ఉద్దేశ్యం

-అదనపు పోషక ఆహారం గా మునగాకు పొడి -జంక్ ఫుడ్ కి దూరంగా ఉండండి.. నిత్య ఆహారంలో పోషక విలువలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *