విజయవాడ,నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ కార్యవర్గ ప్రమాణ స్వీకారం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. సొసైటీ చైర్మన్ గా గవిర్నేని గాంధీ, డైరెక్టర్లుగా పిన్నిబోయిన గోపాలరావు, ధారవతు బేబిబాయిలు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కృష్ణప్రసాదు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షల మేరకు రైతుల శ్రేయస్సే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సకాలంలో వర్షాలు పడుతున్నాయని, చెరువులు, రిజర్వాయర్లు జలకలతో తొణికిసలాడుతున్నాయని పేర్కొన్నారు. సీఎం రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని వెల్లడించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు తోడు సొసైటీల ద్వారా రైతులకు విస్తృతంగా సేవలను అందించాలని సూచించారు. ముందుగా దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి, సొసైటీ స్థలదాత గొట్టిముక్కల శేషయ్య విగ్రహాలకు పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు.
Tags vijayawada
Check Also
సత్యసాయి జిల్లాలో జరిగిన ప్రమాదంపై మంత్రి అచ్చెన్నాయుడు విచారం
-గొర్రెల కాపరి ఓబులపతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించిన మంత్రి అచ్చెన్నాయుడు -రహదారి ప్రమాదంలో గొర్రెల కాపరి ఓబులపతికి …