Breaking News

స్వాతంత్ర్య ఫలాలు అందరికీ అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఘ‌నంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజ‌య‌వాడ సెంట్రల్ నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడిండి. ఈ సందర్భంగా అజిత్ సింగ్ నగర్ లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియం, సత్యనారాయణపురం, గిరిపురం, బీసెంట్ రోడ్, అయోధ్యనగర్ సహా పలుచోట్ల జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా హాజరై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. తొలుత దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనుల విగ్రహాలకు పూలమాలలు వేసిన ఘన నివాళులర్పించారు. అనంత‌రం విలేక‌ర్లతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ‌, విదేశాలలో నివసిస్తున్న దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వజ్రోత్సవ వేడుకలలో భాగంగా నగరంలో నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, హర్ ఘర్ తిరంగా యాత్రలకు విశేష స్పందన లభించిందని పేర్కొన్నారు. ఈ 76 ఏళ్ల కాలంలో దేశం ఎంతో పురోగతి సాధించిందని.. ఇంకా సాధించాల్సింది చాలా ఉందని చెప్పుకొచ్చారు. జాతీయ జెండాను ఎగురవేయడమంటే స్వేచ్చను అనుభవించడమేనని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య దినోత్సవం అనేది కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా జరుపుకునే పండుగ అని మల్లాది విష్ణు తెలియజేశారు. బ్రిటీష్‌ నిరంకుశత్వ పాలనకు ప్రతిఘటించి వారిపై తిరుగు బాటు బావుటా ఎగురవేసిన వారిలో కృష్ణా జిల్లా నాయకులు ముందు వరుసలో నిలిచారని తెలిపారు. గాంధీ మహాత్ముడు ఇచ్చిన పిలుపుతో జిల్లా నుంచి ఎందరో ఉద్యమకారులు పుట్టుకొచ్చారని వెల్లడించారు. జాతికే కేతనం ఇచ్చిన పింగళి వెంకయ్య, అయ్యదేవర నాగేశ్వరరావు, కాశీనాథుని నాగేశ్వరరావు.. ఇలా ఎందరో మహనీయులు స్వాతంత్ర్యోద్యమానికి ఊపిరి పోసి, దేశ దాస్య శృంఖలాలను తెంచడంలో ముఖ్యభూమిక పోషించారన్నారు. భరతమాత స్వేచ్ఛావాయువులు పీల్చేందుకు ప్రాణాలొడ్డి పోరాడారని వివరించారు. సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా గాంధీ మహాత్ముడు విజయవాడలో పర్యటించినప్పుడు.. ఆయన ఉపన్యాసాన్ని అయ్యదేవర కాళేశ్వరరావు అనువదించారని చెప్పుకొచ్చారు. ఆ త్యాగధనుల పోరాటాలు భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో పేజీలుగా మారాయన్నారు.

ప్రజాస్వామ్యానికి నిర్వచ‌నంలా జ‌గ‌న‌న్న పాల‌న
ఎంద‌రో మ‌హానుభావులు మ‌న దేశానికి స్వాతంత్య్రాన్ని తీసుకువస్తే.. మ‌న జ‌గ‌న‌న్న ఆయ‌న పాల‌న ద్వారా ఆ మ‌హానీయుల త్యాగాల‌కు స‌రైన నివాళి అర్పిస్తున్నార‌ని మల్లాది విష్ణు పేర్కొన్నారు. నిజ‌మైన స్వాతంత్య్ర ఫ‌లాలు పేద ప్రజ‌లందరికీ ద‌క్కేలా చూస్తున్నార‌ని చెప్పుకొచ్చారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధనలో భాగంగా గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు చేసి.. అనేక సంక్షేమ పథకాలను చిట్టచివరి వ్యక్తి వరకూ అందజేస్తున్నారన్నారు. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా అడుగులు వేస్తూ.. ప్రతి ఒక్కరికీ ఉచిత విద్య, వైద్యం, గృహ సదుపాయం కల్పిస్తున్నారన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సుస్థిర అభివృద్ధి సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. నవరత్నాలతో నవయుగానికి నాంది పలికిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ అండగా నిలవాలని ఈ సందర్భంగా కోరారు. స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్ర అభివృద్ధికి ప్రజలందరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పలుచోట్ల అన్నదానాలు నిర్వహించారు. ఎమ్మెల్యే చేతులమీదుగా చిన్నారులకు పుస్తకాలు, పండ్లు, మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమాలలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, డివిజన్ల ఇంఛార్జిలు, కోఆర్డినేటర్లు, వైఎస్సార్ సీపీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పిఠాపురంలో మినీ గోకులాలు ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

-రైతు యాతం నాగేశ్వరరావుకి గోవులు అందజేత -రాష్ట్రవ్యాప్తంగా 12,500 గోకులాలకు లాంఛనంగా ప్రారంభోత్సవం -మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణాభివృద్ధి శాఖ నిధులతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *