విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంపై వివిధ ప్రభుత్వ శాఖల శకటాల ద్వారా ప్రదర్శన ప్రజలనెంతగానో ఆకట్టుకుంది. విజయవాడ ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో సోమవారం రాష్ట్ర స్థాయి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో 15 శకటాలను ప్రదర్శించిన అనంతరం నగర ప్రజలు తిలకించే విధంగా ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం నుండి బెంజ్ సర్కిల్, రామవరప్పాడు రింగ్ రోడ్, గుణదల, విజయ టాకీస్ సెంటర్, పాతబస్ స్టాండ్, బందర్ రోడ్, కలెక్టర్ ఆఫీస్ మీదుగా తిరిగి ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంకు చేరుకున్నాయి. ఈ శకటాలను ఆయా ప్రాంతాలలో ప్రజలు తిలకించి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై అవగాహన చేసుకున్నారు. 15 శకటాల ప్రదర్శన నగర ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది.
Tags vijayawada
Check Also
ప్రైవేట్ బస్సుల తనిఖీలు-అధిక చార్జీ వసూలు చేసే బస్సులపై చట్టపరమైన చర్యలు
-జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి పండుగకు స్వస్థలాలకు వచ్చే ప్రయాణికుల …