విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అత్యుత్తమ విద్యా ప్రమాణాలు పాటించిన పాఠశాలకు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మెమోంటో, ప్రసంసా పత్రాలు అందజేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం లో సోమవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయీ వేడుకల్లో ఈ ప్రశంసా పత్రాలను అందజేశారు. జిల్లా పరిషత్ హైస్కూల్ విభాగంలో ప్రకాశం జిల్లా హనమంతునిపాడు పాఠశాలకు, శ్రీకాకుళం జిల్లా కింతలి జిల్లా పరిషత్ హైస్కూల్ కు, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ విభాగంలో విజయనగరం జిల్లా తాటిపూడి గర్ల్స్ స్కూల్ కి, ఏపీ ట్రైబల్ వేల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ విభాగంలో విజయనగరం జిల్లా భద్రగిరి పాఠశాలకు, ఏపీ మోడల్ స్కూల్స్ విభాగంలో విజయనగరం జిల్లా పెనుమలి పాఠశాలకు, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ విభాగంలో ప్రకాశం జిల్లా రాయవరంకు, మున్సిపల్ స్కూల్స్ విభాగంలో కర్నూలులోని ఏపీజే అబ్ధుల్ కలాం మెమోరియల్ మునిసిపల్ స్కూల్ కు, కేజీవీబీ విభాగంలో శ్రీకాకుళం జిల్లా వంగరకు ముఖ్యమంత్రి చేతులు మీదుగా మెంమెంటో, ప్రసంసా పత్రాలు అందజేశారు.
Tags vijayawada
Check Also
క్షతగాత్రులై స్విమ్స్ ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్
-స్విమ్స్ ఆసుపత్రి నందు క్షతగాత్రులకు ఇచ్చిన హామీ మేరకు తమని తమ స్వంత ప్రాంతాలకు వాహనాలలో పంపిస్తూ మరియు శ్రీ …