-మొదటి బహుమతి – గ్రామ వార్డు సచివాలయ శాఖ శకటం…
-రెండవ బహుమతి విద్యా శాఖ శకటం…
-మూడవ బహుమతి గృహనిర్మాణ శాఖ శకటం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర స్థాయి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రదర్శించిన శకటాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. వీటిలో మొదటి బహుమతిగా గ్రామా వార్డు సచివాలయ శాఖకు, రెండవ బహుమతిగా విద్యా శాఖకు, మూడవ బహుమతిగా గృహ నిర్మాణ శాఖలు ఎంపిక అయినవి. విజయవాడ ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం లో సోమవారం నిర్వహించిన స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గెలుపొందిన శకటాలకు సంబంధించి ఆయా శాఖల కార్యదర్సులకు ప్రశంసా పత్రాలను అందించారు. కన్నుల పండుగగా నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్రంలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి 15 శకటాలను ప్రదర్శించారు. ఈ శకటాలకు సంబంధించి త్రివర్ణ పతాకానికి 100 సంవత్సరాలు అనే సందేశంతో పర్యాటక శాఖ శకటం, గ్రామ వార్డు సచివాలయ శాఖ గడప గడపకు మన ప్రభుత్వం – ఇంటింటా సంక్షేమం శకటం, వ్యవసాయ శాఖకు సంబంధించి వ్యవసాయ యాంత్రీకరణ శకటం, పశుసంవర్ధక శాఖ డాక్టర్ వై.ఎస్.ఆర్. సంచార పశు ఆరోగ్యసేవ – 1962 శకటం, విద్యా శాఖ జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, నాడు-నేడు శకటం, విద్యా శాఖకు సంబంధించి రెండవ శకటం గా మన బడి, నాడు నేడుతో రూపురేఖలు మారుతున్న ప్రభుత్వ పాఠశాలల శకటం, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించి ఆరోగ్య సేవా శకటం, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ రెండవ శకటం గా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, వై.ఎస్.ఆర్. విలేజ్ అర్బన్ క్లినిక్స్, తల్లి-బిడ్డ ఎక్స్ ప్రెస్ సేవలు, 2023 నాటికీ 16 క్రొత్త వైద్య కళాశాలల్లో 5 కళాశాలలు సిద్ధం శకటం, గ్రామీణ పేదరిక నిర్ములన శాఖకు సంబంధించి మహిళలు మహారాణులు, వై.ఎస్.ఆర్ పెన్షన్ కానుక, వై.ఎస్.ఆర్ చేయూత, వై.ఎస్.ఆర్. ఆసరా, వై.ఎస్.ఆర్ సున్నా వడ్డీ శకటం, మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖకు సంబంధించి పోషకాహారం అందించడం, ఆరోగ్య మరియు నాణ్యమైన విద్య పేదరికాన్ని అంతం చేయడానికి సమగ్ర అభివృద్ధికి హామీ అనే శకటం, సాంఘిక సంక్షేమ శాఖ జగనన్న సంక్షేమ పధకాలు శకటం, ఉన్నత విద్యా శాఖ విద్యా నైపుణ్యాలతో భవితకు సిద్ధం అవుతున్న శకటం, నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు అనే సందేశంతో గృహ నిర్మాణ శాఖ, కీలక రంగాల్లో సమగ్ర పరిశ్రమాభివృద్ది, సంమ్రుద్ధిగా ఉపాధి అనే సందేశంతో పరిశ్రమల శాఖ, నగర వనాలు అనే సందేశంతో అటవీ శాఖ ప్రదర్శించిన శకటాలు ఆహుతులను ఆకట్టుకున్నవి. పరేడ్ కమాండర్ బిందు మాధవ్ గరికపాటి ఆధర్వర్యంలో కవాతు ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనలో మొత్తం 12 కంటిజెంట్ లు పరేడ్ లో పాల్గొన్నాయి. అలాగే 8 బ్రాస్ బ్రాండ్స్, ఒక పైప్ బ్రాండ్ ప్రదర్శనల్లో పాల్గొన్నాయి.
కంటిజెంట్ ల వివరాలు :
2వ బెటాలియన్ – ఏపీఎస్‌పీ కర్నూలు, 3వ బెటాలియన్ – ఏపీఎస్‌పీ కాకినాడ, 5వ బెటాలియన్ – ఏపీఎస్‌పీ విజయనగరం, 6వ బెటాలియన్ – ఏపీఎస్‌పీ మంగళగిరి, 11వ బెటాలియన్ – ఏపీఎస్‌ప2 కడప, ఎన్‌సీసీ బాయ్స్, ఎన్‌సీసీ గర్ల్స్, ఏపీ సోషల్ వేల్ఫేర్ రెసిడెన్సియల్ స్కూల్స్, ఏపీ ట్రైబల్ వేల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, ఏపీ రెడ్ క్రాస్ సోసైటీ, ఏపీ సైనిక్ వేల్ఫేర్ డిపార్ట్ మెంట్ లు పరేడ్ లో పాల్గొన్నాయి. ఆర్మడ్ కంటిజెంట్ విభాగం 5వ బెటాలియన్, ఏపీఎస్‌పీ విజయనగరం బెస్ట్ అర్మడ్ కంటిజెంట్ గా నిలువగా, 2వ బెటాలియన్, ఏపీఎస్‌పీ కర్నూలు రెండవ బెస్ట్ ఆర్మడ్ కంటిజెంట్ గా నిలిచింది. యూత్ రెడ్ క్రాస్ సొసైటీ ఆఫ్ ఇండియన్ రెడ్ క్రాస్ బెస్ట్ అన్ ఆర్మడ్ కంటిజెంట్ గా నిలువగా, ఏపీ సోషల్ వేల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ బాలురలకు రెండవ బెస్ట్ అన్ ఆర్మడ్ కంటిజెంట్ గా నిలిచింది. ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు వ్యాఖ్యాతలుగా అభిషేక్, జుహితలు వ్యవహరించారు.